మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నించాడు.
కీసర: మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన మహిళ(35) ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రిలో వర్కర్. గురువారంరాత్రి స్వగ్రామానికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్‌స్టాప్ వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. బాధితురాలి కేకలకు సమీపంలోని రైతులు వచ్చి కానిస్టేబుల్‌ను చితకబాదారు. శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.