‘బీజేపీలోకి వెళ్తోంది చెత్త మాత్రమే’ | congress leader ponnam prabhakar takes on bjp | Sakshi
Sakshi News home page

‘బీజేపీలోకి వెళ్తోంది చెత్త మాత్రమే’

May 22 2017 8:14 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘బీజేపీలోకి వెళ్తోంది చెత్త మాత్రమే’ - Sakshi

‘బీజేపీలోకి వెళ్తోంది చెత్త మాత్రమే’

చాలామంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీజేపీలో చేరతారనడం అవాస్తవమని, ఇది ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారమని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

సంగారెడ్డి : చాలామంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీజేపీలో చేరతారనడం అవాస్తవమని, ఇది ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారమని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీజేపీలో నాయకులు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి మాత్రమే ఉన్నారని, అందుకే బయటివారిని ప్రోత్సహించి ఆకర్షిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లిన చెత్తను మాత్రమే కలుపుకుంటున్నారని, తమ పార్టీలో నాయకులకు కొదవ లేదని పేర్కొన్నారు. అమిత్‌షాకు తెలంగాణలో పట్టుదొరికే పరిస్థితి లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement