కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని సీఎల్‌పీ నేత జానా రెడ్డి విమర్శించారు.
టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు: జానారెడ్డి
Aug 24 2017 1:06 PM | Updated on Oct 30 2018 7:50 PM
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని సీఎల్‌పీ నేత జానా రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. అభిప్రాయం చెప్పకూడదని అధికార పార్టీ భావించడం అప్రజాస్వామికమన్నారు. ప్రాజెక్టు కట్టలా.. వద్దా అని అధికారులు ప్రశ్న అడగటం సరి కాదన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దు అనేది కాంగ్రెస్ అభిమతం కాదని, కాంగ్రెస్ పార్టీయే ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యం కాదని చెప్పారు.
Advertisement
Advertisement