పరిమళించిన మానవత్వం | Collector and sp react on road accident | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం

Feb 27 2018 11:02 AM | Updated on Mar 21 2019 8:35 PM

Collector and sp react on road accident - Sakshi

గాయపడ్డ వారిని బయటకు తీస్తున్న జేసీ

ఆదిలాబాద్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ముగ్గురు యువకులను కలెక్టర్, ఎస్పీ వెంటనే ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు. సోమవారం ఆదిలాబాద్‌ జి ల్లా మావల మండలం బట్టి సావర్‌గాం శివారులో జాతీ య రహదారి 44పై ఓ టిప్పర్‌.. మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో మోటార్‌ సైకిల్‌పై మహారాష్ట్ర లోని ముకుడ్‌బంద్‌ నుంచి దేవాపూర్‌ వెళ్తున్న తిప్పర్తివార్‌ గణే‹ష్, నైనీవార్‌ వెంకటేశ్, శట్‌పల్లివార్‌ శుభం తీవ్రంగా గాయపడ్డారు.

అప్పుడే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన కోసం కోర్టా–చనాఖా బ్యారేజీకి వెళ్తున్న కలెక్టర్‌ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ డాక్టర్‌ గోపీ అటుగా వెళుతున్నారు. ప్రమాద విషయాన్ని గమనించి వెంటనే తమ వాహనాలను ఆపారు. క్షతగాత్రులను ట్రైనీ కలెక్టర్‌ వాహనంలో రిమ్స్‌కు తరలించారు. ఎస్పీ వారియర్‌ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement