మాజీ మంత్రికి షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌

CM KCR Shocked Baswaraj Saraiah Over MLA Ticket - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి బస్వరాజ్‌ సారయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు షాక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సారయ్యకు టిక్కెట్‌ ఇవ్వటానికి ఆయన నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతికి కూడా కేసీఆర్‌ టిక్కెట్‌ ఇచ్చేందకు నిరాకరించారు. ఆదివారం బస్వరాజ్‌ సారయ్య, కుంజా సత్యవతి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు.

భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని వారిని కేసీఆర్‌ బుజ్జగించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నేతలకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వని నేతలకు కేసీఆర్‌ ముందుగానే సమాచారం ఇస్తున్నారు. ఎమ్మెల్సీగా, కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తానని బుజ్జగిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top