ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని మోసం చేస్తున్నారని ఎంఎస్‌ఎఫ్( మాదిగ విద్యార్థి ఫెడరేషన్)
చిట్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని మోసం చేస్తున్నారని ఎంఎస్‌ఎఫ్( మాదిగ విద్యార్థి ఫెడరేషన్) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి విమర్శించారు. చిట్యాల ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులను సీఎం చేస్తానని, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం నేడు మరచిపోయారని ఎద్దేవాచేశారు. ఎస్సీ వర్గికరణకు చట్టబద్ధత కల్పించేందుకు అఖిల పక్షాన్ని ఢీల్లీకి తీసుకుపోవాలని ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలను డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గికరణకు వ్యతికేకి అయిన టీపీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కొంత మంది మాదిగలు టీఎమ్మార్పీఎస్ పేరుతో మంద క్రిష్ణమాదిగను విమర్శించటం తగదన్నారు. వారికి మాదిగ జాతి తగిన బుద్ధి చేబుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఫిబ్రవరిలో భారీ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఆసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి చేకూరి గణేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు పాల క్రిష్ణ, ఎంఎస్‌ఎఫ్ మండల అధ్యక్షుడు ఏర్పుల మధు, నాయకులు తోటకూరి స్వామి, ఎర్ర స్వామి, జిట్ట వెంకన్న పాల్గొన్నారు.