సుజీ.. ఎంతపని చేసింది!! | Chimp Suzi Attacks On Gardener In Nehru Zoological Park Hyderabad | Sakshi
Sakshi News home page

ఎన్‌క్లోజర్‌ బయటికొచ్చిన సుజీ..

Oct 1 2019 3:50 AM | Updated on Oct 1 2019 10:59 AM

Chimp Suzi Attacks On Gardener In Nehru Zoological Park Hyderabad - Sakshi

జూలో తోడు లేక తల్లడిల్లుతున్న ఓ చింపాంజీ అక్కడ పనిచేసే హెడ్‌ మాలీపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.

బహదూర్‌పురా: జూలో తోడు లేక తల్లడిల్లుతున్న ఓ చింపాంజీ అక్కడ పనిచేసే హెడ్‌ మాలీపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటికి వచి్చన ఆడ చింపాంజీ సుజీ.. హెడ్‌ మాలీ యాదయ్యపై దాడి చేసి కాలిపై గాయపరిచింది. సోమవారం జూపార్కుకు సెలవు కావడంతో పెద్ద గండం తప్పింది. ప్రముఖ వ్యాపార సంస్థ సహారా చైర్మన్‌ సుబ్రతోరాయ్‌ 2011లో బహుమతిగా ఆడ చింపాంజీ సుజీని జూకు అందించారు. అప్పట్నుంచి సుజీ జూలో సందర్శకులను అలరిస్తూ వస్తోంది. 

ఈ క్రమంలోనే పెద్దదైన సుజీ ఒంటరితనం అనుభవిస్తోంది. ఇటు జూ సిబ్బంది ఇన్నాళ్లైనా దానికి ఓ తోడును తేవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే సుజీ గతంలో ఆహారం కూడా మానేసి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకుంది. ఎన్‌క్లోజర్‌లో నుంచి సుజీ బయటికి రావడం ఇది రెండోసారి. గతంలో యానిమల్‌ కీపర్‌ను ఎన్‌క్లోజర్‌లో ఉంచి బయటి నుంచి సుజీ గడియపెట్టింది. కాగా దాడి ఘటనపై సమాచారం అందుకున్న జూ వెటర్నరీ వైద్యులు, అధికారులు వెంటనే స్పందించి ఫుడ్‌కోర్ట్‌ వద్ద సుజీపై మత్తు మందు ప్రయోగించి పట్టుకున్నారు. గాయపడిన యాదయ్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement