టీడీపీ నేత కట్టా మనోజ్‌ రెడ్డి పై మరో చీటింగ్ కేసు | Cheating case on Katta Manoj Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కట్టా మనోజ్‌రెడ్డిపై మరో చీటింగ్ కేసు

Sep 6 2014 2:27 AM | Updated on Aug 10 2018 8:08 PM

టీడీపీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్టా మనోజ్‌రెడ్డిపై హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాలిలా ఉ న్నాయి.

భీమారం : టీడీపీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్టా మనోజ్‌రెడ్డిపై హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. పైడిపల్లికి చెందిన సం దీప్‌రెడ్డికి చెందిన సుమారు 18 ఎకరాల భూమిని కట్టా మనోజ్‌రెడ్డి పదేళ్ల క్రితం ఖరీదు చేశాడు. ఈ క్రమం లో 2006లో హైదరాబాద్‌లో అతడిపై  150 చీటింగ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మనోజ్‌రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్డ్ చేస్తూ కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
 
తదుపరి ఉత్తర్వులు వెలువడేవర కు ఈ భూములు క్రయ, విక్రయాలు జరపొద్దని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు కూడా  జారీ చేసింది.  ఈ భూముల్లో పైడిపల్లికి చెంది న 18 ఎకరాల భూమి కూడా ఉంది.  ఈ భూమిని మనోజ్‌రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. దేవేందర్‌రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఆ భూమి విక్రయానికి రూ.5.50 కోట్లకు  ఒప్పందం కుదుర్చుకున్నాడు.  తొలుత దేవేందర్‌రెడ్డి అడ్వాన్స్‌గా రూ.1.50 కోట్లు చెల్లించాడు. దీనిపై స్థానిక నాయకుడు ఒకరు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement