హోండా అధినేతపై చీటింగ్ కేసు | cheating case filed againist honda chairmen | Sakshi
Sakshi News home page

హోండా అధినేతపై చీటింగ్ కేసు

Apr 16 2015 8:27 AM | Updated on May 25 2018 5:49 PM

బైకుల డెలివరీలో రవాణా చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసి డీలర్‌ను మోసం చేసినందుకు హోండా సంస్థ అధినేత కీతా మురామత్సుతో పాటు మరో 14 మందిపై పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

హైదరాబాద్: బైకుల డెలివరీలో రవాణా చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసి డీలర్‌ను మోసం చేసినందుకు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ అధినేత జపాన్‌కు చెందిన కీతా మురామత్సుతో పాటు మరో 14 మందిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నం 2లో నివసించే డీఎస్పీ రెడ్డి అనే వ్యక్తికి విజయవాడలో కనకదుర్గ ఆటోమొబైల్స్ పేరుతో హోండా వాహనాల డీలర్‌షిప్ కంపెనీ ఉంది.

ఆయన 2001 నుంచి ఇప్పటివరకు సుమారు 45 వేల బైక్‌లను హోండా సంస్థలోని గోడౌన్‌ల నుంచి కొనుగోలు చేసి విక్రయించారు. తమ వద్ద ఒక్కో బైక్‌కు రవాణా చార్జీల కింద రూ.2,068 వసూలు చేస్తూ హోండా సంస్థ భారీ మోసానికి పాల్పడిందని డీఎస్పీ రెడ్డి ఇక్కడి మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement