నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సోమవారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సోమవారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కాటేదాన్‌కు చెందిన జయమ్మ(50) కోఠి 94 స్టాప్ మీదుగా ఈఎన్‌టి ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది.
ఈ క్రమంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు తెంపుకొని ఉడాయించారు. ఈ క్రమంలో ఆమె కిందపడి స్వల్ప గాయాలపాలైంది. దీంతో స్థానికులతో కలిసి సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.