
కచ్చితమైన ప్రణాళికతోనే భూ పంపిణీ: చాడ
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రికి సూచించారు.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రికి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు.
పట్టదారు పాస్ పుస్తకల్లో అవకతవకలు, అసైన్డ్ భూముల్లో అక్రమాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని సరిదిద్దాలంటే రెవెన్యూ చట్టాలపై లోతైన అవగాహన ఉన్న సీనియర్ అధికారులు, నిష్ణాతులతో సమావేశం నిర్వహించి ముందుకెళ్లడం సుముచితంగా ఉంటుందని సూచించారు.