మొబైల్‌ యాప్‌తో 'జనగణన'

Census Calculated With Mobile App In Jangaon District - Sakshi

డిజిటల్‌ పద్ధతికి కేంద్రం శ్రీకారం

అక్టోబర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఆరంభం

ప్రయోగాత్మకంగా మూడు రాష్ట్రాలు ఎంపిక

పైలెట్‌ ప్రాజెక్టుగా జనగామ

కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో సీఎస్‌సీ కేంద్రాల ఏర్పాటు

281 మంది వీఎల్‌ఈలకు శిక్షణ పూర్తి

సాక్షి, జనగామ: కేంద్ర ప్రభుత్వం పేపర్‌ పద్ధతికి స్వస్తిచెప్పి ఈ సారి మొబైల్‌ యాప్‌ తో జనాభా లెక్కలు చేపట్టనుంది. ప్రయోగాత్మకంగా మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా జనగామ జిల్లా ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇందుకోసం అవసరమైన సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌)ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మీ సేవా, ఈ సేవా కేంద్రాల మాదిరిగానే ఈ కేంద్రాలు పని చేయనున్నాయి. జిల్లాకు ఒక డీసీ (జిల్లా కోఆర్డినేటర్‌)ని అదే విధంగా ప్రతి గ్రామానికి ఒక వీఎల్‌ఈ (విలేజ్‌ లెవల్‌ ఎన్యుమరేటర్స్‌)లను కూడా ఇప్పటికే ఎంపిక చేసింది. ఎంపిక చేసిన వారందరికీ గత వారం జిల్లా కేంద్రంలో శిక్షణ కూడా ఇచ్చారు. పదేళ్లకొకసారి దేశంలో జనగణన చేస్తారు. 2001లో జనాభా సర్వే చేశాక మళ్లీ చేయలేదు. కాగితాలను ఉపయోగించి సర్వేను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత చేయించేవారు. ఈ సారి పేపర్‌ పద్ధతికి స్వస్తి పలికి  ప్రత్యేక యాప్‌ సాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సర్వే ప్రయోగాత్మకంగా ప్రారంభించగా కొనసాగుతుంది. తెలం గాణలో ఈ సర్వేను ఇప్పటికే ప్రారంభించా ల్సి ఉండగా ఈ డిజిటల్‌ పద్ధతిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సవరించి చర్యలు చేపట్టవచ్చునని భావించి పూర్తిగా అధ్యయనం చేశాకే వచ్చే నెల నుండి దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. 

ఎలా చేస్తారు..
సర్వే కోసం జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను,క్షేత్ర స్థాయిలో డోర్‌ టు డోర్‌ వెళ్లి వివరాలు సేకరించేందుకు 281 మంది వీఎల్‌ఈలను నియమించారు. వీఎల్‌ఈలందరికీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. జనగామ జిల్లాను పైలెట్‌ జిల్లాగా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 1,20 లక్షల కుటుంబాలు శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు గ్రామాలకు వెళ్లి ట్యాబ్‌ల ద్వారా కుటుంబాల వారీగా వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లోభద్రపరుస్తారు. ఒక్కో గృహ సర్వేకు రూ.మూడు , వాణిజ్య సర్వేకు రూ.4.50 చొప్పున రెమ్యునరేషన్‌ చెల్లిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top