
ఆ నాయుడు.. ఈ నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారు
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి విమర్శించారు. పోలవరం అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశానని, ప్రాజెక్టుకు అంశాలన్నింటినీ ప్రధానికి వివరించానని ఆయన చెప్పారు.
తెలంగాణకు అన్యాయం జరగనీయమని ప్రధాని హామీ ఇచ్చారని పాల్వాయి అన్నారు. పోలవరం డిజైన్ మార్చితేనే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, పర్యావరణ, గిరిజనశాఖ అనుమతులు లభిస్తాయని ఆయన చెప్పారు.