‘బోస్టన్‌’ చెప్పిందేంటి?

Boston Consulting Group Report On The Lockdown - Sakshi

పలు దేశాల్లో కరోనా కేసులపై అధ్యయనం 

ఎప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయొచ్చనే దానిపై విశ్లేషణ 

నివేదిక విడుదల చేసిన  బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? యాక్టివ్‌ కేసులు ఎన్ని? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొం దించింది. వీటన్నింటి ఆధారంగా ఆయా దేశాల్లో కేసుల సంఖ్య పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటాయి? లాక్‌డౌన్‌ నిబంధనలు ఏ తేదీ నుంచి ఎత్తేయొచ్చు? అన్న అంశాలపై అంచనాలను సిద్ధం చేసింది. గత నెల 25 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపో తున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని తెలిపింది.

10వ మరణంతో లాక్‌డౌన్‌.. 
భారత్‌లో కరోనా కేసులు జూన్‌ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా కట్టింది. నివేదికలో సూచించిన గ్రాఫ్‌ ప్రకారం జూన్‌ మూడో వా రం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొ త్త కేసులు నమోదవుతాయి. చైనాలో మాదిరిగా కరోనా కారణంగా పదో మరణం సంభవించిన రోజున భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిం దని, చైనాతో పాటు, బెల్జియం, పోలండ్‌ వం టి దేశాల్లోనూ దాదాపు ఇదే స్థితిలో లాక్‌డౌన్‌ ప్రకటించాయని తెలిపింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్‌ ప్రాం తాల్లో ఏ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందు బాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివ రించింది. దీంతో పాటు వైరస్‌ బారిన పడ్డ వారి ని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామ ర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ లో జూన్‌ ఆఖరు నుంచి సెప్టెంబర్‌ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా కట్టింది. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉం చుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది. సీఎం కేసీఆర్‌ నివేదిక ఆధారంగానే విలేకరుల సమావేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకు తన మద్దతు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top