పర్సెంటేజీలకే ప్రాధాన్యమిచ్చారు | BJP MLA Candidate Fires On TRS Govt | Sakshi
Sakshi News home page

పర్సెంటేజీలకే ప్రాధాన్యమిచ్చారు

Nov 9 2018 9:34 AM | Updated on Nov 9 2018 9:34 AM

BJP MLA Candidate Fires On TRS Govt - Sakshi

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గంగిడి మనోహర్‌రెడ్డి

సాక్షి,చౌటుప్పల్‌ : టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపిస్తే మునుగోడును ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రతి పనిలో కమీషన్లు, పర్సంటేజీలకే ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన వందమంది యువకులు, మహిళలు గురువారం మనోహర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సమావేశంలో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందన్నారు.నియోజకవర్గాన్ని  పూర్తి అవినీతిమయంగామార్చార్చారని ఆరోపించారు.

తనకు ఎలాంటి పదవి లేకున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రూర్బన్‌ పథకం కింద చౌటుప్పల్‌ మండలానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. మార్పు కోసం కమలం పువ్వు గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరిగె రమేష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, ఎస్సీమోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉబ్బు భిక్షపతి, వైస్‌ ఎంపీపీ కాయితి రమేష్,  నాయకులు  రామనగోని శంకర్, పాలకూర్ల జంగయ్య, కంచర్ల గోవర్థన్‌రెడ్డి, అరిగె లింగస్వామి, నారెడ్డి అంజిరెడ్డి, ఊడుగు వెంకటేశం, యాదయ్య,  మల్లికార్జున్, అరిగె వీరాస్వామి, తమ్మకొండ శ్రీశైలం, శివకుమార్, కట్ట కృష్ణ, రాదారపు సత్తయ్య,  పబ్బు వంశీ,  లక్ష్మణ్, బత్తుల జనార్దన్, చీరకూరి వెంకటేశం, ఇట్టగోని మహేష్, రాజు, ఆలె నాగరాజు, బలిగె శ్రీను,  పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement