‘హెచ్చరిక’ వద్దు.. | 'Alert' do not want .. | Sakshi
Sakshi News home page

‘హెచ్చరిక’ వద్దు..

Feb 17 2015 12:48 AM | Updated on Sep 2 2017 9:26 PM

బీడి, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు....

నక్కలగుట్ట : బీడి, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు, సవరణలు చేయకూడదని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట వరంగల్ జిల్లా బీడి వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బీడి కట్టలపై కొత్త హెచ్చరికను ముద్రించొద్దని కోరారు.

ధర్నాలో బీడి వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధానకార్యదర్శి ఎండీ ఖాసిం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement