
అధికార లాంఛనాలతో నాగరాజు అంత్యక్రియలు
నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ముష్కరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన
కట్టంగూర్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ముష్కరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు(29) అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. నాగరాజు స్వగ్రామమైన కట్టంగూర్ మండలం రసూల్‌గూడెంలో అంత్యక్రియలు జరిపారు.
నాగరాజు భౌతికకాయానికి అతని తండ్రి శ్రీమన్నారాయణ తలకొరివి పెట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో తెలంగాణ శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుధీర్ లక్టాకియా, ఐజీ వి.నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.