కేసీఆరే రావాలి! | A failed attempt to strike at the Assembly | Sakshi
Sakshi News home page

కేసీఆరే రావాలి!

Dec 4 2014 12:24 AM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆరే రావాలి! - Sakshi

కేసీఆరే రావాలి!

వికలాంగులు కోపోద్రిక్తులయ్యారు. కట్టలు తెగిన ఆగ్రహంతో ఒక్కసారిగా వేదికపైకి చొచ్చుకువచ్చి ఆందోళనకు దిగారు.

  • వికలాంగుల ఆందోళన
  •  రసాభాసాగా మారిన వికలాంగుల దినోత్సవం
  •  అసెంబ్లీ వద్ద ధర్నాకు విఫలయత్నం
  • సాక్షి, హైదరాబాద్: వికలాంగులు కోపోద్రిక్తులయ్యారు. కట్టలు తెగిన ఆగ్రహంతో ఒక్కసారిగా వేదికపైకి చొచ్చుకువచ్చి ఆందోళనకు ది గారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రావా లంటూ నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు.

    దీంతో అంతర్జాతీయ వికలాంగుల దినం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అర్దంతరంగా ముగిసింది. అనివార్య కారణాలతో ముఖ్యమం త్రి  హాజరుకావడంలేదని అధికారులకు ముందే తెలిసినా ఆయనకు స్వాగతం పలుకుతూ రవీంద్రభారతి ప్రవేశ ద్వారంతోపాటు వేదికపైనా బ్యానర్లను ఏర్పాటు చేశారు.

    సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వికలాంగులతో పాటలు, నృత్యపోటీలను నిర్వహించారు. చివరగా ఉన్నతాధికారులు, అతిథులు ప్రసంగించేం దుకు సిద్ధమవుతుండగా.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనని వికలాంగులు పట్టుబట్టారు. వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు రాంబాబు నేతృత్వంలో సుమారు వందమంది వికలాం గులు వేదికపైకి చొచ్చుకువచ్చి బైఠాయించారు.   సభా ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది.

    అనంతరం కొందరు వికలాంగులు ర్యాలీగా అసెంబ్లీ వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ రావడం లేదని వికలాంగుల సంఘం నేతలకు ముందే తెలియజేసినా.. ఆందోళనకు దిగారని వికలాంగల సంక్షేమ శాఖ డెరైక్టర్ శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆందోళనతో తమకు సంబంధం లేదని వికలాంగుల నెట్‌వర్క్, హృదయ్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement