పోరులో 91 మంది

91 Contestants In Nizamabad - Sakshi

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

ఇక వేడెక్కనున్న ప్రచారం

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. బరిలో నిలిచే వారి లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 91 మంది ఎన్నికల పోరులో నిలిచారు. అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 21 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా బాన్సువాడలో ఆరుగురు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది.

‘బాన్సువాడ’లో ఆరుగురు

సాక్షి, బాన్సువాడ: సాధారణ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 8 మంది అభ్యర్థులు మిగలగా, గురువారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల రంగంలో మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీలో రెబెల్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన మల్యాద్రిరెడ్డిని అధిష్టానం బుజ్జగించడంతో  గురువారం నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు సంగెం శ్రీనివాస్‌ గౌడ్, మల్యాద్రిరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. శ్రీనివాస్‌గౌడ్‌ నామినేషన్‌ను తిరస్కరించగా, మల్యాద్రి రంగంలో ఉంటానని ప్రకటించారు. అధిష్టానం సూచనల మేరకు ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన పోచారం సురేందర్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు నిలిచారు.

అభ్యర్థి పేరు    పార్టీ   గుర్తు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌     కారు 
కాసుల బాల్‌రాజ్‌  కాంగ్రెస్‌   హస్తం    
ప్రకాశ్‌ నాయుడు  బీజేపీ  కమలం  
డాక్టర్‌ భీంరావు గైక్వాడ్‌ బీఎస్పీ ఏనుగు  
కొండాని అంజయ్య  పిరమిడ్‌పార్టీ ఆఫ్‌ ఇండియా పిల్లనగ్రోవి     
యం.రమేశ్‌   స్వతంత్ర   బ్యాట్‌

‘కామారెడ్డి’లో తొమ్మిది మంది..

ఉపసంహరణలు నిల్‌

సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 9 మంది పోటీ పడనున్నారు. గత 19వ తేది సాయంత్రం వరకు కొనసాగిన అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా మొత్తం 11 మందికి గాను 22 నామినేషన్‌ సెట్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో ఇద్దరు అభ్యర్థులు తమ పత్రాలను సక్రమంగా సమర్పించకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి అనర్హులుగా గుర్తించి తిరస్కరించారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఉండగా కామారెడ్డి నుంచి బరిలో ఉన్న ఏ ఒక్క అభ్యర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. సాయంత్రం వరకు వేచి ఉన్న ఎన్నికల అధికారి రాజేంద్రకుమార్‌ తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను విడుదల చేశారు. బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 

అభ్యర్థి పేరు పార్టీ  గుర్తు
గంపగోవర్ధన్‌    టీఆర్‌ఎస్‌   కారు 
మహ్మద్‌ అలీ షబ్బీర్‌   కాంగ్రెస్‌      హస్తం  
వెంకటరమణారెడ్డి   బీజేపీ  కమలం  
  కొత్తపల్లి మల్లయ్య  బీఎస్‌పీ  ఏనుగు 
ఎం.గోవర్ధన్‌   సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాగ్‌  ట్రక్కు 
డి.పాండురంగం  ఆమ్‌ఆద్మీ   చీపురు  
డాక్టర్‌ పుట్లమల్లికార్జున్‌  బీఎల్‌ఎఫ్‌  రైతునాగలి  
ఎర్రొల నవీన్‌    ఇండిపెండెంట్‌    బ్యాటు  
కె.కిషన్‌   ఇండిపెండెంట్‌  టార్చ్‌  

‘జుక్కల్‌’లో ఏడుగురు..

సాక్షి, నిజాంసాగర్‌/మద్నూర్‌(జుక్కల్‌): అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో పాటు ఉపసంహరణ గడువు ముగియడంతో జుక్కల్‌ నియోజకవర్గ బరిలో ఏడుగురు అభ్యర్థులు మిగిలారు. మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేయగా ముగ్గురు సౌదాగర్‌ సావిత్రి, శోభావతి సింధే, ప్రతంజిత్‌ కాలేలు స్కృటిలో వెళ్లిపోయారు. మిగతా 10 మందిలో బొగుడమీది సాయిలు, ప్రతంజీత్‌ కాళే, లక్ష్మణ్‌లు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. ముగ్గురు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడంతో ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

అభ్యర్థి పేరు   పార్టీ   గుర్తు
హన్మంత్‌ సింధే   టీఆర్‌ఎస్‌    కారు
సౌదాగర్‌ గంగారాం   కాంగ్రెస్‌    హస్తం
అరుణతార బీజేపీ    కమలం 
భరత్‌వాగ్మారే   బీఎల్‌ఎఫ్‌   రైతు నాగలి
లక్ష్మణ్‌    బీఎస్పీ  ఏనుగు
శ్రీనివాస్‌ ఇండియా ప్రజాబంధు  ట్రంపెట్‌
మోహన్‌      స్వతంత్ర    ట్రక్కు

‘ఆర్మూర్‌’లో ఎనిమిది మంది.. 

సాక్షి, ఆర్మూర్‌: ఆర్మూర్‌ స్థానానికి పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. నామినేషన్ల ఉపసంహణకు గురువారం వరకు గడువు విధించగా స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి పది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా స్కూృటినీలో బహుజన లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థి పల్లెపు వెంకటేశ్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. స్వతంత్య్ర అభ్యర్థి బదావత్‌ మీరాబాయి తన నామినేషన్‌ను ఉపసంహకరించుకోవడంతో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

అభ్యర్థి పేరు  పార్టీ  గుర్తు
ఆశన్నగారి జీవన్‌రెడ్డి  టీఆర్‌ఎస్‌      కారు
వినయ్‌ కుమార్‌రెడ్డి  బీజేపీ   కమలం
ఆకుల లలిత   కాంగ్రెస్‌  హస్తం
కొమిరె సుధాకర్‌    బీఎస్పీ    ఏనుగు
సిందూకర్‌ చరణ్‌  అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గ్రామో ఫోన్‌
మాస్త దయానంద్‌  రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పండ్ల బుట్ట
గుంటి రాజగంగారాం స్వతంత్య్ర బ్యాట్‌
సుంకె శ్రీనివాస్‌ స్వతంత్ర  ఐస్‌ క్రీం

‘ఎల్లారెడ్డి’లో ఎనిమిది మంది

ముగ్గురు నామినేషన్ల ఉపసంహరణ

సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది అభ్య ర్థులు పోటీ పడుతున్నారు. మొదట 11 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం కాంగ్రెస్‌ రెబెల్, బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్‌ సీనియర్‌నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరిం చుకున్నారు. అలాగే స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మరో కాంగ్రెస్‌ నాయకుడు పైల కృష్ణారెడ్డి, మరో స్వతంత్య్ర అభ్యర్థి చాకలి నారాయణ సైతం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం ఎల్లారెడ్డి బరిలో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు ఈఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

అభ్యర్థి పేరు   పార్టీ  గుర్తు
ఏనుగు రవీందర్‌రెడ్డి  టీఆర్‌ఎస్‌ కారు
జాజాల సురేందర్‌  కాంగ్రెస్‌ హస్తం
బాణాల లక్ష్మారెడ్డి బీజేపీ కమలం 
ఎల్లన్న యాదవ్‌  ఎల్లన్న యాదవ్‌   స్టూల్‌    
కప్ప సత్యం సిద్ధార్థరాజ్‌ బహుజన లెఫ్ట్‌ పార్టీ  రైతు నాగలి
బల్వంత్‌రావు   నవ సమాజ్‌ పార్టీ    గ్యాస్‌ సిలిండర్‌
తలారి బాల్‌రాజ్‌ స్వతంత్య్ర  ట్రక్‌  
ఫజల్‌ రెహమాన్‌ స్వతంత్య్ర   కత్తెర 

‘బాల్కొండ’లో తొమ్మిది మంది

ఒకరు నామినేషన్‌ ఉపసంహరణ

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులు తొమ్మిది మందిగా తేలింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఈరవత్రి సుహాసిని తన నామినేషన్‌ను ఉప సంహరించుకోవడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తొమ్మి దిగా రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆ పార్టీ గుర్తులను వర్తింపచేయగా ఇతరులకు వేరే గుర్తులను కేటాయించారు. నామినేషన్‌ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా వెలువరించడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 

అభ్యర్థి పేరు    పార్టీ    గుర్తు
వేముల ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌  కారు 
ఈరవత్రి అనిల్‌  కాంగ్రెస్‌   హస్తం 
రుయ్యాడి రాజేశ్వర్‌    బీజేపీ   కమలం 
ముత్యాల సునీల్‌రెడ్డి  బీఎస్పీ   ఏనుగు 
బింగివార్‌ రవి  తెలంగాణ ప్రజా సమితి  బకెట్‌ 
యెలిగేటి మధుకర్‌  బహుజన్‌ లెఫ్ట్‌ పార్టీ   రైతు నాగలి
అబ్దుల్‌ నయీం  స్వతంత్ర   డిజిల్‌ పంప్‌ 
గుంటి బెనర్జీ  స్వతంత్ర  బ్యాట్‌
సుద్దపల్లి సుధాకర్‌   స్వతంత్ర  రిఫ్రిజిరేటర్‌  

‘నిజామాబాద్‌ రూరల్‌’లో 12 మంది..

సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 12 మంది తలపడనున్నారు. ఈ నెల 19 నామినేషన్ల దాఖలు తుది గడువు నాటికి మొత్తం 13 మంది 25 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి బీఎస్పీ అభ్యర్థి ఇమ్మడి గోపి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా 12 మంది బరిలో నిలిచారు. 

అభ్యర్థి పేరు   పార్టీ    గుర్తు
బాజిరెడ్డి గోవర్ధన్‌    టీఆర్‌ఎస్‌   కారు 
రేకులపల్లి భూపతిరెడ్డి   కాంగ్రెస్‌ హస్తం
  గడ్డం ఆనంద్‌రెడ్డి  బీజేపీ  కమలం 
మలావత్‌ విఠల్‌    జాతీయవాదీ కాంగ్రెస్‌  గడియారం 
కాసల శ్రీనివాస్‌   పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా    టెలివిజన్‌     
గుగులోత్‌ బాలరాజు      ఆల్‌ ఇండియా జైహింద్‌   కుట్టు మిషన్‌ 
నూర్జహాన్‌    బహుజన్‌ లెఫ్ట్‌ పార్టీ   రైతు నాగలి  
మల్లె మనోజ్‌  ఇండియా ప్రజాబంధు   బాకా    
గంగాధర్‌ మచ్చ  స్వతంత్ర   గ్యాస్‌ సిలిండర్‌  
దమ్మారెడ్డి ప్రదీప్‌రెడ్డి  స్వతంత్ర   ట్రాక్టర్‌ నడిపే రైతు    
భగవాన్‌ నాయక్‌    స్వతంత్ర      బీరువా  
బైస రామదాసు    స్వతంత్ర   కత్తెర  

‘అర్బన్‌’లో 21 మంది..

ఐదుగురు ఉపసంహరణ

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ బరిలో 21 మంది అభ్యర్థులు నిలిచారు. గురువారం నామినేషన్ల చివరి రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి టికెటు ఆశించి భంగపడి శివసేనపార్టీ నుంచి నామినేషన్‌ వేసిన ధన్‌పాల్‌ సూర్యనారాయణ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. దీంతో 21 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

అభ్యర్థి పేరు    పార్టీ    గుర్తు
బిగాల గణేష్‌గుప్తా   టీఆర్‌ఎస్‌     కారు  
తాహెర్‌బిన్‌హుందాన్‌   కాంగ్రెస్‌   హస్తం 
యెండల లక్ష్మీనారాయణ   బీజేపీ   కమలం 
రమేశ్‌ రాజమల్లు  బీఎస్పీ    ఏనుగు  
సయ్యద్‌ముజీబొద్దీన్‌    అంబేద్కర్‌నేషనల్‌ కాంగ్రెస్‌  గ్రహంబేల్‌ 
మహ్మద్‌ సిరాజొద్దీన్‌        ఆమ్‌ఆద్మీ   చీపురు 
నరాల రత్నాకర్‌    ఆల్‌ఇండియా ఫార్వడ్‌ బ్లాక్‌    సింహం 
మంచిర్యాల రఘునాథ్‌  తెలంగాణ ప్రజాపార్టీ   టార్చ్‌ 
మహ్మద్‌ ఇస్మాయిల్‌  బీఎల్‌ఎఫ్‌  రైతు నాగలి
అబ్ధుల్‌ రహీం  సమాజ్‌వాది పార్టీ  క్యాండిల్‌ 
ఓజ్జ రమేశ్‌ పిరిమిడ్‌ పార్టీ   టిల్లర్‌ 
బల్ల శ్రీనివాస్‌   స్వతంత్ర   గ్రేప్స్‌ 
పడకంటి రాము  స్వతంత్ర  టెలిఫోన్‌ 
ప్రదీప్‌కుమార్‌ మల్కాయి స్వతంత్ర  స్కూల్‌బ్యాగు 
కె.వి.లక్ష్మారెడ్డి స్వతంత్ర  ఐరన్‌బాక్సు 
పుప్పాల రవీందర్‌ స్వతంత్ర  చెస్‌బోర్డు 
ఖాజామొహినొద్దీన్‌  స్వతంత్ర  గ్లాస్‌టుంబ్ల్లర్‌ 
గోపు శంకర్‌  స్వతంత్ర  ప్రెషర్‌కుక్కర్‌ 
జి.ప్రశాంతి  స్వతంత్ర  బ్యాంగిల్స్‌ 
శివప్రసాద్‌మహాజన్‌ స్వతంత్ర  క్యాలిక్యూలేటర్‌
సయ్యద్‌ కైసర్‌ స్వతంత్ర  బాటిల్‌  

ముగ్గురి నామినేషన్ల ఉపసంహరణ

 సాక్షి, బోధన్‌రూరల్‌(బోధన్‌): నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం బోధన్‌ అస్లెంబీ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి గోపిరాం తెలిపారు. మొత్తం 15 మంది అభ్యర్థులు 28 సెట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. 20న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల పరిశీలన(స్కృటీని)లో బీఫారంలు లేనందున బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హెచ్‌.సుభాష్, గడ్డం విక్రమ్‌ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్‌ నామినేషన్లను తిరస్కరించారు. గురువారం మహ్మద్‌ ఆజామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో 11 మంది బరిలో నిలిచారు. 

అభ్యర్థి పేరు  పార్టీ  గుర్తు
మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌    టీఆర్‌ఎస్‌  కారు     
పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి   కాంగ్రెస్‌    చేతి గుర్తు    
అల్జాపూర్‌ శ్రీనివాస్‌   బీజేపీ   కమలం 
మహ్మద్‌ షార్‌జిల్‌ పర్వేజ్‌ స్వంతంత్ర అభ్యర్థి  కిటికి     
బానోవత్‌ జీవన్‌ బహుజన లెఫ్ట్‌ పార్టీ  రైతు నాగలి    
సింగడి పాండు    బీఎల్‌ఎఫ్‌ ఏనుగు  
పి.గోపికిషన్‌    శివసేన  ధనుర్‌బాణం 
ఎండీ యూసుఫ్‌    ఎస్పీ స్టూల్‌ 
ఎండీ నావాజ్‌ పాషా  స్వంతంత్ర   టెలిఫోన్‌     
బంజ వీరప్ప   పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా టెలివిజన్‌     
గడ్డం విక్రమ్‌ రెడ్డి   స్వంతంత్ర  బెలూన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top