కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుల మధ్య అంగీకారం కుదిరింది. సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్న విషయం విదితమే. ఈఎన్‌సీల భేటీలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఎడమ కాలువకి ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.