ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం నాగాపూర్ గ్రామ శివారులో ద్విచక్రవాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం నాగాపూర్ గ్రామ శివారులో ద్విచక్రవాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన కనిరామ్(50), బొగ్గి(45) అనే వ్యక్తులు తమ కుల పెద్ద అయిన మహరాజ్‌ను దర్శించుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.