శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లు | 156 special trains to Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లు

Oct 30 2017 2:16 AM | Updated on Oct 30 2017 2:16 AM

156 special trains to Sabarimala

సాక్షి, హైదరాబాద్‌:  శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 156 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, తిరుపతి, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్‌ల నుం చి నవంబర్‌ 10, జనవరి 18వ తేదీల మధ్య నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటికి సోమవారం ఉదయం 8 గంటల నుం చి అడ్వాన్సు రిజర్వేషన్‌ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.  

ఇవీ రైళ్ల వివరాలు..  
హైదరాబాద్‌–కొల్లాం–హైదరాబాద్‌(వయా కాజీపేట, గూడూరు, రేణిగుంట) నవంబర్‌ 17, 21 డిసెంబర్‌ 11, 15, 23, 31, జనవరి 3, 5, 7, 9, 11, 13 తేదీల్లో. తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 15, డిసెంబర్‌ 1, 8, 15, 24, జనవరి 2, 5, 7, 9, 11, 13, 15 తేదీల్లో. హైదరాబాద్‌–కొల్లాం–హైదరాబాద్‌ (వయా రాయచూరు, గుంతకల్, రేణిగుంట) నవంబర్‌ 25, డిసెంబర్‌ 16, 19, 24 జనవరి 4, 6, 8, 10, 12, 14, 15 తేదీల్లో ఉంటాయి.

తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 27, డిసెంబర్‌ 18, 21, 26, జనవరి 6, 8, 10, 12, 14, 16, 17 తేదీల్లో. నిజామాబాద్‌–కొల్లాం–నిజామాబాద్‌ నవంబర్‌ 13, 29. తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 19, 23 తేదీల్లో. కాకినాడ టౌన్‌–కొల్లాం–కాకినాడ టౌన్‌ నవంబర్‌ 10, 15, 19, 23, 27, డిసెంబర్‌ 12, 14, 17, 18, 20, 21, 23, 24, 28, జనవరి 1, 3, 4, 6, 7, 10, 11, 13, 14 తేదీల్లో. తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 12, 17, 21, 25, 29, డిసెంబర్‌ 14, 16, 19, 20, 22, 23, 25, 26 30 , జనవరి 3, 5, 6, 8, 9, 12, 13, 15, 16 తేదీల్లో. హైదరాబాద్‌–కొల్లాం–హైదరాబాద్‌ (వయా నడికుడి, గుంటూరు) డిసెంబర్‌ 12, 20, 30, జనవరి 2, 16 తేదీల్లో.

తిరుగు ప్రయాణంలో డిసెంబర్‌ 14, 22, జనవరి 1, 4, 18 తేదీల్లో. కరీంనగర్‌–కొల్లాం–కరీంనగర్‌ డిసెంబర్‌ 29, కాచిగూడ–కొల్లాం–కాచిగూడ జనవరి 1. తిరుగు ప్రయాణంలో జనవరి 3. నర్సాపూర్‌–కొల్లాం–నర్సాపూర్‌ డిసెంబర్‌ 29, 30. తిరుగు ప్రయాణంలో డిసెంబర్‌ 31, జనవరి 1. మచిలీపట్నం–కొల్లాం డిసెంబర్‌ 10, 16, 19. తిరుగు ప్రయాణంలో డిసెంబర్‌ 9, 15, 18 తేదీల్లో. విజయవాడ –కొల్లాం డిసెంబర్‌ 8, 14, 23. తిరుగు ప్రయాణం డిసెంబర్‌ 12, 21, 24. అకోలా–కొల్లాం (వయా నిజామాబాద్‌) డిసెంబర్‌ 14. ఆదిలాబాద్‌ –కొల్లాం డిసెంబర్‌ 28. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–కొల్లాం జనవరి 5, 11. కొల్లాం–సికింద్రాబాద్‌ డిసెంబర్‌ 31, జనవరి 7, 13. మచిలీపట్నం–కొల్లాం జనవరి 7, 13.

తిరుగు ప్రయాణంలో.. జనవరి 6, 12 తేదీల్లో. విజయవాడ–కొల్లాం జనవరి 4, 10 తేదీల్లో. తిరుగు ప్రయాణం జనవరి 9, 15. కొల్లాం– తిరుపతి డిసెంబర్‌ 9, 16, 23, 30. తిరుపతి–అకోలా డిసెంబర్‌ 18. తిరుపతి–ఔరంగాబాద్‌ డిసెంబర్‌ 11, 25. తిరుపతి–ఆదిలాబాద్‌ జనవరి1వ తేదీన నడుస్తాయి. మరికొన్ని రైళ్లను కూడా త్వరలో ప్రకటించనున్నారు. రైళ్ల సమయాలు సహా ఇతర వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో  ఉన్నాయని అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement