breaking news
-
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం
సాక్షి ముంబై: ప్రధాని మోదీతోపాటు మహారాష్ట్రలో ని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపడుతున్న రేవంత్.. ఇందులో భాగంగా శనివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోనంత వరకు తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు విషయంపై నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు రేవంత్ చెప్పారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే..దేశంలోకెల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోవడం వల్లే మహారాష్ట్రలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచి్చన 25 రోజుల్లోనే 22.22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్ల రుణమాఫీ, 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 50 లక్షల మంది పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు రేవంత్ వివరించారు. 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారుమహారాష్ట్రకు రావల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని రేవంత్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. అంబేడ్కర్ సహా దేశ ప్రగతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర జన్నించిందని గుర్తుచేశారు. ప్రజలను మోసగించిన బీజేపీ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అమీన్ పటేల్‌ను గెలిపించండి... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముంబై ముంబాదేవి నియోజకవర్గంలో తెలంగాణవాసులు ఎక్కువగా ఉండే కమాటిపురాలో రోడ్ షో నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముంబాదేవిలో మూడుసార్లు గెలిచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాసులకు అండగా ఉంటామన్నారు. -
ఆరు గ్యారంటీలు.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసోళ్లను కూడా నక్సలైట్లు దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా?. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?. తక్షణమే విద్యా కమిషన్‌ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యవాదులారా.. కమిషన్ రద్దు కోసం రోడ్డెక్కండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎఫ్పుడో మర్చిపోయారు?. జనం కష్టాల్లో ఉన్నా ఫాంహౌజ్‌కే పరిమితమైనోడిని లీడర్‌గా గుర్తిస్తారా?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ -
మాకు మాటలు రావనుకుంటున్నారా?.. అరెస్టులకు భయపడం: కేసీఆర్
సిద్ధిపేట, సాక్షి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతల వద్ద ధీమా వ్యక్తం చేశారాయన. అదే సమయంలో రేవంత్ సర్కార్‌ను ఉద్దేశించి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారాయన.శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదు. ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది. మళ్లీ ప్రభుత్వంలోకి రాబోయేది మనమే(బీఆర్ఎస్). రాబోయే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే’’ అని అన్నారు. అలాగే.. .. ‘‘ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అది చేస్తాం.. ఇది చేస్తాం అని పిచ్చి మాటలు మాకు రావా?. కానీ, మేం మా మేనిఫెస్టోలోచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువగా అడగకుండానే చేశాం. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా?. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది వాళ్లకు సేవ చేయడానికి. మాకు మాటలు రావనుకుంటున్నారా?. ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. రౌడీ పంచాయితీలు చేయడం మాకూ వచ్చు. అరెస్టులకు భయపడేది లేదు’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: కేసీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు: కౌంటర్ ఇలా.. -
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘‘ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడి చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.’’ అంటూ ఆయన మండిపడ్డారు.పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తే మేం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి అంటే రేవంత్‌కు భయం పట్టుకుందని.. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. -
కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు
సాక్షి,మెదక్‌జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్ 9) నర్సాపూర్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటీ కంపు ఎక్కువ. కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్‌రావు అన్నారు. కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్ -
ప్రధాని ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్‌రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం -
హైదరాబాద్‌లోనే ఉన్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ.. అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయానంటూ మీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఏసీబీలాంటి మీ ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం పలుకుతా. వారికి చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా. మీ బర్త్‌డే సందర్భంగా వారు కేక్ కట్ చేస్తానంటే నేను ఇప్పిస్తాను’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంకు హ్యాపీ బర్త్‌డే.. నా అరెస్టు కోసం ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో మీరు ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అంటూ సంబోధించిన సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టగలరా. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నుంచి ఆంధ్రా కాంట్రాక్టర్‌ను తొలగించే దుమ్ముందా. సీఎం హోదాలో ఒక కాంట్రాక్టు సంస్థకు గులాంగిరి చేస్తున్నావా’అని కేటీఆర్ మండిపడ్డారు. పుండు ఒక చోట.. మందు మరోచోట‘మూసీ ప్రాజెక్టు బాధితులను పట్టించుకోకుండా మరోచోట సీఎం పాదయాత్ర చేస్తూ పుండు ఒక చోట అయితే మందు మరోచోట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వేల ఇళ్లను కూల్చివేసేందుకు ప్రణాళికలు వేసి..లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్రణాళిక వేసిన సీఎం దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర డ్రామా చేస్తున్నారు. లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి సీఎంకు లేదు. దశాబ్దాలపాటు వ్యర్థాలు కలుస్తుంటే అరవై ఏళ్లు కళ్లుండీ చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ వ్యవహరించింది. మూసీ దోపిడీ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో మూడురోజుల పాటు చర్చించే సమయం సీఎంకు ఉంది. కానీ ఆరు గ్యారంటీల అమలుపై సమీక్షించేందుకు సమయం లేదా. మోసపూరిత హామీలను పక్కన పెట్టి కమీషన్ల కోసం మూసీ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకున్నారు. పాదయాత్ర చేసినా పొర్లుదండాలు పెట్టినా మూసీ పరీవాహక ప్రాంత ప్రజల వేదన మీకు శాపంగా మారుతుంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నల్లగొండ నేతల అరెస్టు అక్రమంముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురి చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, హామీల అమలులో వైఫల్యంపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తా: సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. నాతో కలసిరాకపోతే రాయి కట్టి మూసీలో వేస్తా. బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్న వాళ్లు.. వాళ్ల పేర్లు ఇవ్వండి. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపైకి బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లారంగాలు ధైర్యముంటే తారీఖు చెప్పండి. మా వెంకన్న (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)తో బుల్డోజర్ నడిపిస్తా. మా ఎమ్మెల్యే సామెల్‌తో జెండా ఊపిస్తా. ప్రధాని మోదీ సబర్మతి, గంగా నదులను బాగు చేసుకోవచ్చుగానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా? నకిలీ బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి, యాదాద్రి: ‘‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తా. బిల్లా రంగాలు, చార్లెస్ శోభారాజ్‌లు కలిసి రావాలి. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం. సంగెం శివయ్య సంకల్పంతో మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేస్తాం’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలో మూసీ నది వద్ద పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సభలో ప్రసంగించారు. వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే.. ‘‘ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ నది.. ఇప్పుడు మురికికూపంగా మారి విషాన్ని చిమ్ముతోంది. పాలకులు పగబట్టారా? లేక దేవుడు శాపంపెట్టాడా అని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. మూసీని పునరుజ్జీవింపజేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మూసీ పునరుజ్జీవనం కోసం మంచి సంకల్పం తీసుకున్నాను. ఇది నా జన్మదినం కాదు.. ఇక్కడికి రావడంతో నా జన్మధన్యమైంది. ఇక్కడ బతికే పరిస్థితి లేదు.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన వద్దంటే చరిత్రహీనులుగా మిగులుతారు. మూసీ కాలుష్యంతో ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు. చివరికి ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల క్రితం వరకు స్వచ్ఛమైన నీరు పారిన మూసీ నది వెంట పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లారంగాలు ప్రజలవైపు ఉంటారో, లేదో తేల్చుకోవాలి. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టులకు సీఎంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ పాపం తగలక తప్పదు! కేసీఆర్.. నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే.. మూసీ పరీవాహక ప్రాంతాల బిడ్డల కాళ్లు చేతులు వంకర పోతుంటే నీకు పట్టదా? నీకు పాపం తగలక తప్పదు. నువ్వు కుక్కచావు చస్తావ్ కేసీఆర్. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్.. మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు. నాకు డబ్బులు కావాలంటే నల్లగొండ జిల్లానే కావాలా? నువ్వు తెచ్చిన ధరణిలో అబ్రకదబ్ర చేస్తే కోట్లాది రూపాయలు రావా? మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది. ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు? అణుబాంబు కంటే ప్రమాదం మూసీ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదు. ఒకవేళ గర్భం దాల్చినా అంగవైకల్యంతో పిల్లలు జన్మిస్తున్నారు. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరంగా మూసీ నది తయారైంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ అతిపెద్ద విస్ఫోటనాన్ని మూసీ రూపంలో ఎదుర్కోబోతోంది. మూసీ కాలుష్యం వల్ల ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. గోదావరిని మూసీతో కలిపి మూసీ, ఈసీ వాగులను కృష్ణాతో అనుసంధానించే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేస్తాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ పర్యటన, యాత్ర ఇలా.. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో మూసీపై ఉన్న సంగెం–»ొల్లెపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తొలుత మూసీ ఒడ్డున ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మూసీ పక్షాళన చేస్తానని సంకల్పం తీసుకున్నారు. మూసీ తీరం వెంట నడుచుకుంటూ వస్తూ నదిలో పారుతున్న నీటిని ఒక బాటిల్లోకి తీసుకున్నారు. బోటులో ఎక్కి నదిలో కొద్దిదూరం ప్రయాణం చేసి నీటిని పరిశీలించారు. ఒడ్డుకు చేరుకున్నాక సంగెం గ్రామం వైపు నుంచి బ్రిడ్జి మీదుగా భీమలింగం కత్వ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మత్స్యకారులు, రైతులు, వివిధ వర్గాల వారితో మాట్లాడారు. రూ.రెండు కోట్లతో సంగెం వద్ద ఉన్న భీమలింగశ్శ్వర ఆలయం వద్ద అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సంగెం గ్రామ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరు: మంత్రి కోమటిరెడ్డిసాక్షి, యాదాద్రి: తప్పుచేసినవారు ఎంతటి వారైనా జైలుకెళ్లాల్సిందేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన సభలో ఆయన మాట్లాడారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధిలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఆ పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్తున్నారని.. కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయలేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవనం ఆరేళ్ల ప్రాజెక్టు అని.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రేవంత్‌రెడ్డినే తిరిగి సీఎం అవుతారని పేర్కొన్నారు. -
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అత్యంత హేయం
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: రేవంత్‌రెడ్డి తన పుట్టినరోజున కూడా తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మీద చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, నిరంకుశత్వం మాని నిర్మా ణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో హరీశ్‌రావు సీఎంపై ధ్వజమెత్తారు.కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావని, నీలాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్‌రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. మూసీ నీళ్ల మురికితో కడిగినా నీ నోరు మురికిపోదని, నీ వంకర బుద్ధి ఇగ మారదన్నారు. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచి్చన నీచ చరిత్ర నీదని ఆరోపించారు. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజాక్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతామని హరీశ్‌రావు హెచ్చరించారు.ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వరుసగా విషాహార ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంతో గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదన్నారు. విషాహారం తిని మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన జరిగి 24 గంటలు కూడా కాకమునుపే మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాడితప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌వన్నీ కోతలే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదని, ప్రజలంతా గమనిస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 237మందికి రూ. 55.57 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పదిలంగా ఉంటారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా.. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేనా అని ప్రశ్నించారు. -
ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా: రేవంత్‌రెడ్డి
సాక్షి, వరంగల్ జిల్లా: బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని.. జెండా, అజెండా పక్కనపెట్టి మూసీ అభివృద్ధికి ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు దోచుకోవడమే తెలుసు, ప్రజల కష్టాలు తెలియవంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.‘‘ఒకప్పుడు మూసీలో అరుదైన చేపలు బతికేవి. ఇప్పుడు మూసీ నదిలో చేపలు బతికే పరిస్థితి లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో కల్లును అమ్ముకునే పరిస్థితి లేదుమూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంత వాసులకు వరంగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు, కూరగాయలు, పాలు కలుషితం అయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావడం లేదు. నల్గొండ జిల్లాను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ వెంటాడుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘మూసీ కాలుష్యంతో అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. మోదీ సబర్మతి ఫ్రంట్ రివర్, గంగానది ప్రక్షాళన చేస్తే అద్భుతం అంటున్నారు. మరి మేం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా?. మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు?. ఎవరు అడ్డువచ్చినా మూసి ప్రక్షాళన చేసి తిరుతాం. ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి. 9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి. -
కేటీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై బండి సంజయ్ శుక్రవారం(నవంబర్ 8) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.‘బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రేవంత్,నేను కొట్లాడాం. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. డైవర్షన్,కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు,ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసి చివరకు కాంగ్రెస్,బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యాయి. కేటీఆర్ ట్విటర్లో తప్ప ఎక్కడా కనిపించడు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయి. బీఆర్ఎస్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్‌రావు మాత్రమే’అని బండి సంజయ్ అన్నారు. ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాద యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే రేవంత్: కేటీఆర్ -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి నన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే, జైలులో మంచిగా యోగా చేసి ట్రిమ్గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. ఉడుత ఊపులకు బెదరం. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఎలా ఖతం చేయాలని అనుకున్న మాట వాస్తవం. నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆయన విచక్షణకు సంబంధించిన అంశం. ఏ విచారణకైనా సిద్ధం. దేనికైనా రెడీగా ఉన్నా. ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్లించే ఆటలతో ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయకు. గాసిప్ పక్కన పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యలు చేశారు. ‘ఫార్ములా ఈ రేస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని నా బాధ్యతగా ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. హైదరాబాద్, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. నాకు ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసు అందలేదు..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చారు. రూ.55 కోట్ల ఫైల్‌పై సంతకం నేనే చేశా... ‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు నిర్వహణ సంస్థ ఎఫ్ఐఏ, హెచ్ఎండీఏ, స్పాన్సరర్ అయిన గ్రీన్ కో నడుమ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. తమకు లాభం రాలేదనే కారణంతో రెండో విడత రేస్ నుంచి గ్రీన్కో తప్పుకోవడంతో రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచేందుకు ప్రభుత్వం తరఫున రూ.55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అప్పటి హెచ్ఎండీఏ కార్యదర్శి అర్వింద్‌కుమార్ తప్పేమీ లేదు. ఫైల్‌పై నేనే సంతకం చేశా. రూ.55 కోట్లు చెల్లించమని నేనే చెప్పినందున నాదే బాధ్యత. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అక్కర్లేదు పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నడుమ అంతర్గతంగా డబ్బు సర్దుబాటు చేసుకోవచ్చు. సర్వ స్వతంత్ర సంస్థ హెచ్ఎండీఏకు సీఎం చైర్మన్‌గా, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. హెచ్ఎండీఏ నిర్ణయాలు దేనికీ కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అవసరం లేదు. రేవంత్ సీఎం పదవి చేపట్టిన వెంటనే నా మీద ఉన్న కోపంతో ఫార్ములా ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో జాగ్వార్, నిస్సాన్ వంటి కంపెనీలు సిగ్గుచేటు అని ప్రకటించగా, ప్రపంచం ముందు హైదరాబాద్ పరువు పోయింది. ఈ రేస్ రాకుండా రేవంత్ తీసుకున్న నిర్ణయంతో రూ.700 కోట్ల నష్టం వచ్చింది. హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీసి నష్టం చేసినందుకు రేవంత్ పైనే కేసు పెట్టాలి. సీఎం రేవంత్ మొగోడైతే మేఘా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి మీద కేసు పెట్టాలి. రూ.55 కోట్ల చుట్టూ రాజకీయం చేస్తున్న రేవంత్ రూ.లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్ నిర్వహిస్తారట..’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మొబిలిటీ రాజధానిగా మార్చేందుకే.. ‘హైదరాబాద్‌లో ‘ఎఫ్ వన్’కార్ల రేసును నిర్వహించేందుకు 2003లో ప్రయత్నించి ప్రత్యేకమైన ట్రాక్ కోసం గోపన్‌పల్లిలోని 400 ఎకరాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇందులోని 129 సర్వే నంబర్లో సీఎం రేవంత్‌కు చెందిన 31 ఎకరాల భూమి కూడా ఉంది. అయితే రైతుల అభ్యంతరాలతో భూ సేకరణపై హైకోర్టులో కేసు నడుస్తోంది. మేం కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచి ఎలక్ట్రిక్ వాహన రంగానికి నగరాన్ని ‘భారత్‌లో మొబిలిటీ రాజధాని’గా మార్చాలని అనుకున్నాం. ప్రపంచంలోని గొప్ప నగరాల జాబితాలో హైదరాబాద్‌ను చేర్చాలనే తపనతో సియోల్, జోహెన్నస్‌బర్గ్ వంటి నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌కు ‘ఫార్ములా ఈ’ని రప్పించాం. తొలి దశ రేసింగ్ తర్వాత రాష్ట్రానికి రూ.700 కోట్ల మేర లబ్ధి జరిగింది. ఫార్ములా ఈ రేస్, మొబిలిటీ ప్రోగ్రామ్‌తో రూ.2,500 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇతర సంస్థలు కూడా తెలంగాణ ఈవీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి..’అని కేటీఆర్ వివరించారు. -
వచ్చే నెల్లో పాదయాత్రలు, సభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికల హామీలను అమలుచేయకపో వటాన్ని ఎండగడుతూ డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లపాటు (2028లో అసెంబ్లీ ఎన్నికల వరకు) నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించింది. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల స్టేట్ లెవల్ వర్క్ షాప్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నందున శనివారం రాష్ట్రంలోని ధాన్యం కోనుగో లు కేంద్రాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సందర్శించాలని నిర్ణయించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించాలని ప్రతి పక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లోని ఇళ్లల్లో బీజేపీ నేతలు ‘మూసీ నిద్ర’ చేసి అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల్లోనే సర్కార్‌పై వ్యతిరేకత: కిషన్రెడ్డికాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత వచ్చిందని తెలిపారు. గతంలో తెలంగాణను పట్టి పీడించిన బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూము లు తాకట్టు పెట్టి అప్పుల కోసం అన్వేషణ సాగి స్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీనే సరైన రాజకీయ ప్రత్యామ్నాయమని తేలిపోయిందని అన్నారు.పార్టీని సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో ప్రజలకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడు దామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని వేల కోట్లయినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగాఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీని ప్రజలే కోరుతున్నారు: డా.కే లక్ష్మణ్తెలంగాణలో అతి తక్కువ సమయంలో 30 లక్షల మంది బీజేపీ సభ్యులుగా చేరారని, దీన్నిబట్టే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అర్ధమవుతోందని ఆ పార్టీ నేత డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వర్క్‌షాపులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌బాబు, రామారావు పటేల్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎం.ధర్మారావు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోం‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. శుద్ధ నీళ్లు ఇవ్వాల్సిందే.. కృష్ణా, గోదావరి నుండి నీటిని తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. అయితే ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోం’ అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వర్క్‌షాప్ అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తామని ప్రకటించారు. త్వరలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తారని తెలిపారు. -
ఆటంబాంబు పేలబోతోంది..: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వర్ధన్నపేట/తొర్రూరు: తుప్పు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. రాజకీయ ఆటంబాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీఆర్ఎస్ నేత (కేటీఆర్) తీరు ఉందన్నారు. తనను జైలుకు పంపిస్తారని.. జైలులో జిమ్ చేసి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరినీ జైలుకు పంపించాలనే ఉద్దేశం ప్రభుత్వానిది కాదని, తప్పు చేస్తే ఉపేక్షించడం ఉండదన్నారు. తప్పు చేసిన వాళ్లపై ఆటంబాంబు పేలబోతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ బాంబులు ఇంకా తుస్సుమనలేదని చెప్పారు. కొద్దిరోజుల్లో తాను పేల్చిన బాంబు ఏంటో మీరే చూస్తారని స్పష్టం చేశారు. అరెస్టు చేయాలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారని, వారంతా ఫలితాలు అనుభవిస్తారని చెప్పారు. పేదల సొమ్ము విదేశాలకు పంపుకున్నారని, రూ.55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పోయిందో, ఎవరి ఖాతాలో వేసుకున్నారో ప్రజల ముందు తమ ప్రభుత్వం పెట్టి చూపిస్తుందన్నారు. అవి చౌకబారు విమర్శలు ఈడీ దాడులు చేస్తోందని..అదాని కాళ్లు పట్టుకుంటున్నాడని తనపై కేటీఆర్ చవకబారు విమర్శలు చేస్తున్నాడని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, గతంలో బీఆర్ఎస్లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ కాళ్లకు నమస్కరించానని చెప్పారు. అది వయసుకు ఇచ్చిన గౌరవంతోనేనన్నారు. పదేళ్లు సామాన్యులను వంచించిన చరిత్ర బీఆర్ఎస్కే దక్కిందని, పేదల మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర పేరిట డ్రామా చేస్తున్నాడన్నారు. పాదయాత్ర చేసినా.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు వారిని నమ్మబోరని తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో 19 లక్షల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు అండగా నిలిచారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించనుందన్నారు. ఆయా సమావేశాల్లో ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుంది: మంత్రి పొంగులేటి
సాక్షి, వరంగల్: నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుందంటూ మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్దన్నపేట సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయటూ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.‘‘మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తనపని తాను చేసుకుంటది.. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారు’’ అంటూ పొంగులేటి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్ -
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని.. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే అందుకు రెడీ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు, మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది?. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తా. తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతా’’ అంటూ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు‘‘టార్గెట్ కేటీఆర్‌పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలి. ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నాకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయి. రేవంత్ ఉడుత ఊపులకు భయపడేది లేదు. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తా. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయటపడింది. బీఆర్ఎస్ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయి.’’ అని కేటీఆర్ ఆరోపించారు.ఫార్ములా ఈ-రేస్‌పై స్పందిస్తూ..ఫార్ములా ఈ రేస్‌ను త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. గ్రీన్ కో అనే కంపెనీ తప్పుకుంది. స్పాన్సర్‌ను పట్టుకుందామని మున్సిపల్ సెక్రటరీకి నేను చెప్పాను. 2024లో జరిగే ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్ పేరును చేర్చలేదు. హెచ్ఎండీఏ నుంచి నవంబర్ 14 2024న జీవో ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం నుండి 55 కోట్లు కట్టాము. కమిషనర్ అరవింద్ కుమార్ ఫైల్ పంపితే పురపాలక శాఖ మంత్రిగా నేను సంతకం పెట్టాను. ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో శాఖకు నగదు బదిలీ జరుగుతుందిహెచ్ఎండీఏకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. హెచ్ఎండీఏకి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు. ఫార్ములా 4 రేస్ మేము నిర్వహించాము. రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు. నా పైన కోపంతో రేవంత్ రెడ్డి రాగానే ఫార్ములా ఈ-రేస్ రద్దు చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్రీ రేస్ క్యాన్సిల్ అయితే అంతర్జాతీయ సంస్థలు విమర్శలు చేశాయి. నాపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేస్ హైదరాబాద్ నగరంలో ఉండాలని రూ.55 కోట్లు పంపాము. అందులో నాకు ఏమైనా వచ్చాయా? నేను హెచ్ఎండీఏ వైఎస్ ఛైర్మన్‌గా నిర్ణయం తీసుకున్నా. 2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పెడతామని అన్నారు.ఒలింపిక్స్‌కు దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మెగా కంపెనీపై ఏసీబీ కేసు పెట్టు. రేవంత్ రెడ్డి సంచులతో దొరికి 8 ఏళ్లు అయింది. మరి ఆ కేసు ఏమైందో?. ఫార్ములా ఈ రేస్ క్యాన్సిల్ చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి. విశ్వ నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నది రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇమేజ్ను పెంచినందుకు కేసు పెడతావా రేవంత్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి తప్పించుకోలేరు. నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకో.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. -
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.‘కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా; నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై...పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే. కనీసం సమీక్ష అయినా నిర్వహించారా?విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి. కాంగ్రెస్ వచ్చింది. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతోంది పాపం’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం...విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS— KTR (@KTRBRS) November 7, 2024 -
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదేనేమో.. రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, తెలంగాణ భవన్: సుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది.మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుంది. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుందిసుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం హైడ్రా,మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుందిఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుంది తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు…— KTR (@KTRBRS) November 7, 2024 -
కొడంగల్ ఎత్తిపోతల్లో సీఎం వాటా ఎంత ఢిల్లీ వాటా ఎంత: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా కంపెనీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు కట్టబెడుతున్నారు. అనుభవం కలిగిన కంపెనీలను టెక్నికల్ బిడ్‌లో అనర్హులుగా ప్రకటించి రెండు సంస్థలకు కేక్ ముక్క ల్లా పనులు పంచి పెట్టి డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నారు. రూ.4,350 కోట్లలో సీఎం వాటా, ఢిల్లీ వాటా ఎంతో చెప్పాలి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మె ల్యే వివేకానంద్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అరాచక కంపెనీ, ఆంధ్రా కంపెనీ అన్నారుగా.. ‘రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అని పేర్కొన్న మేఘా సంస్థకే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రూ.వేల కోట్ల విలువ చేసే పనులు అప్పగిస్తున్నారు. గతంలో ‘అరాచక కంపెనీ’, ‘ఆంధ్రా కంపెనీ’, ‘పొలిటికల్ మాఫియా’అని సదరు కాంట్రాక్టు సంస్థపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తెచ్చేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ సదరు సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం మూలంగా కూలిపోయినా బ్లాక్ లిస్టులో పెట్టకపోవడానికి కారణమేంటో చెప్పాలి. కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్టును రేవంత్‌రెడ్డి తారుమారు చేసే అవకాశం ఉంది. ఆ నివేదికను వెంటనే బయట పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. గోదావరి జలాల పేరిట రూ.5,500 కోట్ల కుంభకోణం ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’నిబంధన పక్కన పెట్టి మంత్రివర్గ సభ్యుడైన పొంగులేటికి సంబంధించిన కంపెనీకి మూసీ ప్రాజెక్టు పనులు ఇస్తున్నారు. రేవంత్‌కు సహాయ మంత్రిలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ కూడా దీనిపై మాట్లాడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్న మోదీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,100 కోట్లతో ప్రతిపాదించిన పనులు రద్దు చేశారు. ఇప్పుడు అంచనాలు రూ.5,500 కోట్లకు పెంచి మరో భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఈ ప్రాజెక్టును కూడా ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’కి ఇచ్చేందుకే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం చెప్పిన చోట అధికారులు సంతకాలు పెడితే ఉద్యోగాలు ఊడటం ఖాయం..’అని మాజీమంత్రి హెచ్చరించారు. పొంగులేటీ..నువ్వు జైలుకు పోకుండా చూసుకో ‘అరెస్టులు అంటూ అందరి జాతకాలు చెప్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలి. పొంగులేటి నివాసంలో జరిగిన ఈడీ దాడులపై ఇప్పటివరకు బీజేపీ స్పందించలేదు. ఐటీసీ కోహెనూర్ హోటల్లో అదానీ కాళ్లు పట్టుకుని, కడుపులో తలపెట్టి తనను కాపాడాలని పొంగులేటి కోరాడు. రేవంత్ నివాసంలో గౌతమ్ అదానీ కొడుకు కరణ్ అదానీతో నాలుగు గంటల సుదీర్ఘ భేటీ జరిగింది. ఈడీ దాడిలో ఏం జరిగిందో పొంగులేటి చెప్పాలి. అరెస్టుల గురించి చెప్పడానికి పొంగులేటి ఎవరు? వీళ్లు నడిపేది సర్కారా లేక సర్కస్సా?. గొట్టంగాళ్లకు భయపడేది లేదు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ హస్తం ఉంది. మరమ్మతు చేయకపోవడం వెనుక ఏదో మతలబు ఉంది. కేసీఆర్‌ను బదనాం చేసేందుకు ఈ అరాచక శక్తులు ఎంతకైనా తెగిస్తాయి. కుంభకోణాలను బయట పెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు. అయినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి పొంగులేటి జైలుకు పోవడానికి రెడీగా ఉండాలని కేటీఆర్ అన్నారు. అలాగే, భారీ స్కామ్‌లు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఊడగొడుతాం. బీఆర్ఎస్ తరఫున ఉన్నతాధికారులకు ఇదే మా హెచ్చరిక. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో సీఎం రేవంత్ భారీ కుంభకోణానికి తెర తీశారు. మంత్రి పొంగులేటి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు డబ్బులు పంచుకుంటున్నాయిరేవంత్ రెడ్డి అవినీతిపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు. భారీ కుంభకోణాలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?. కేబినెట్లో ఉన్న మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారు?. పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉండాలి. వాళ్ళు, వీళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరు?. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా?. బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి సిద్ధంగా ఉండాలి.మూసీ ప్రాజెక్ట్ కోసం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. -
సెక్యూరిటీ లేకుండా వెళ్తే ప్రజలే తంతారు: కేటీఆర్
కవాడిగూడ/రాంగోపాల్‌పేట్: సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బయటకు వెళ్తే ప్రజలు తన్నే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో సీఎంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. రవాణా రంగ కార్మీకులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో మీటర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.5 వేల భృతి ఏది? ఆటో డ్రైవర్లకు నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.2,500 భృతి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల పేర్ల జాబితాను ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటివరకు వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గం నిరుద్యోగులను, రైతులను, వృద్ధులను కూడా మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సీపీఐ అనుబంధ కార్మీక సంఘం ఏఐటీయూసీ కూడా ప్రభుత్వంపై పోరాడటం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపినా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడుతామని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, బీఆర్ నేతలు బాల్కసుమన్, గణేష్‌గుప్త, దాస్యం వినయ్ భాస్కర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆటో డ్రైవర్ జేఏసీ నాయకులు జీ వెంకటేశం, వేముల మారయ్య, పి. శ్రీకాంత్, లింగంగౌడ్ తదితరులు హాజరయ్యారు. మహాధర్నాకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆటోలో రావటం గమనార్హం. ప్యారడైజ్‌లో లంచ్ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్న తర్వాత కేటీఆర్ తన పార్టీ నేతలతో కలిసి ప్యారడైజ్‌లో హోటల్లో మధ్యాహ్న భోజనం చేశారు. కేటీఆర్ వెంటన బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, మాగంటి గోపినాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, శంభిపూర్ రాజు తదితరులు ఉన్నారు. కేటీఆర్‌ను పిలువనేలేదు ఇందిపార్కు వద్ద చేపట్టిన ఆటో డ్రైవర్ల మహాధర్నాకు కేటీఆర్‌ను ఆహ్వానించలేదు. అయినా ఆయన హాజరై ఆటో డ్రైవర్ల సమస్యలను పక్కదారి పట్టించారు. –ఆటో డ్రైవర్ల జేఏసీ నేత, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం