breaking news
-
అణువణువునా కుల వివక్ష: రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: ‘భారత సమాజంలో కుల వివక్ష అన్నిచోట్లా లోతుగా, బలంగా ఉంది. అణువణువునా దేశంలో కుల వివక్ష ఉందన్న వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. ఈ వివక్ష కేవలం దేశ ప్రజల జీవితాలను విధ్వంసం చేయడమే కాదు.. భారత రాజ్యాంగానికి, జాతికి సైతం ముప్పులా పరిణమించింది..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ రంగం.. ఇలా ప్రతిచోటా ఉన్న ఈ వివక్ష దేశ ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని, దేశంపై వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదని, కులవివక్షను అందరూ అంగీకరించి దేశ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. కులంతో కూడిన అసమానత చాలా దారుణమని, దళితులను ముట్టుకోని పరిస్థితులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని చెప్పారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇది ఒక ఎక్స్‌రే లాంటిది ‘కుల వివక్ష ఎంత తీవ్రస్థాయిలో ఉందో దేశ ప్రజల ముందు ఉంచుదాం. ఇది కూడా ఎక్స్‌రే లాంటిదే. కుల వివక్షపై మాట్లాడితే దేశాన్ని నేను విభజించేందుకు ప్రయత్నిస్తున్నానని బీజేపీ నేతలు, దేశ ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. దేశ వాస్తవ పరిస్థితిని బయటపెడితే అది విభజించడమా? దేశంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, ఇతర కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంపద ఎలా పంపిణీ చేయాలో నిర్ణయించుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, న్యాయవ్యవస్థ, సైన్యంలో ఎంతమంది ఏ వర్గాల వారున్నారో అడగాలి. ఈ ప్రశ్నలను అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు? నిజాన్ని తొక్కిపెట్టాలనుకునే వారు, దీని గురించి దేశం తెలుసుకోకూడదని అనుకుంటున్నవారే ఈ ప్రశ్నలను అడ్డుకుంటున్నారు. వీరంతా కుల వివక్ష కారణంగా లబ్ధి పొందినవారే. దేశంలో కుల వివక్షను నిర్మూలిస్తానని ప్రధాని మోదీ బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు, న్యాయవ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు, మీడియాలో ఎంతమంది ఆదివాసీలు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదో చెప్పాలి..’ అని రాహుల్ డిమాండ్ చేశారు. కులగణనకు మోడల్‌గా తెలంగాణ ‘కులగణనకు తెలంగాణ మోడల్ అవుతుంది. ఈ అంశంలో తెలంగాణ నాయకత్వం చాలా బాగా పనిచేసింది. అయితే బ్యూరోక్రాటిక్ కులగణన వద్దు. ఈ కులగణనలో అడిగే ప్రశ్నలు అధికారులు ఎక్కడో కూర్చుని రాసేవి కాకూడదు. అదే జరిగితే ప్రజలను అవమానించడమే అవుతుంది. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దేశ ప్రజలే చెప్పాలి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మహిళల నుంచి ఈ ప్రశ్నలు రావాలి. అప్పుడే దీని ఫలితం ఉంటుంది. కేవలం కులగణన జరగడమే కాకుండా దేశానికి అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఓ అ్రస్తాన్ని ఇస్తుంది. తెలంగాణలో కేవలం కులగణన మాత్రమే జరగడం లేదు. దేశ భవిష్యత్తు కోసం ఓ పాలనా వ్యవస్థను డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ నుంచే కార్యాచరణ చేపడుతున్నందుకు గర్వంగా ఉంది..’ అని రాహుల్ అన్నారు. ఉత్తమ్‌రెడ్డి.. ఎక్సెలెంట్ ప్రెజెంటేషన్ తెలంగాణలో కులగణన చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని, ‘ఎక్స్లెంట్ ప్రెజెంటేషన్’ అంటూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సదస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్లు సింహాద్రి, కంచె ఐలయ్య, భూక్యా నాయక్, సూరేపల్లి సుజాత తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కులగణనకు ధైర్యం కావాలి: సీఎం రేవంత్ రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు, తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కులగణనను ఎలాంటి న్యాయ వివాదాలు, విమర్శలకు తావివ్వకుండా 100 శాతం పూర్తి చేసి ఓబీసీల జనాభా లెక్కలను దేశానికి అందిస్తామని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకునేందుకు గుండె ధైర్యం కావాలని, సామాజిక బాధ్యతతో పాటు సమాన అవకాశాలుండాలనే పట్టుదల ఉండాలని రేవంత్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలని, ఆ ఆలోచనతోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్నా కులగణన సమావేశానికి రాహుల్ వచ్చారని చెప్పారు. రాహుల్ బాటలో తాము ఆయన సైనికులుగా ముందుకు వెళుతున్నామని అన్నారు. రాహుల్.. టైటానిక్ కథ ‘1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది. దాని పేరు టైటానిక్. అది ఎప్పటికీ మునిగిపోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు. కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది. సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది. ఇలా దేశంలో కనిపించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీని గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో కులగణన అత్యంత కీలకం..’ అని రాహుల్ చెప్పారు. -
అప్పుడే రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలి: బండి సంజయ్ సవాల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు. ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు. -
‘మార్పు, మార్పు అని ఊదర కొట్టిండ్రు.. మార్పు బాగుందా?’
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాడ్డాక ఏం మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటేనే బిల్డర్లు హడలిపోతున్నారని, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అంటూ నిలదీశారు.తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంకు మంగళవారం మధ్యాహ్నం హాజరైన కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల కంటే తక్కువ లేదు.ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో అందరికి తెలుసు. మార్పు...మార్పు అని ఊదర కొట్టిండ్రు. మార్పు బాగుందా ?నన్ను ఇటీవలే కల్సిన ఒక బిల్దర్ పరిస్థితులు బాగా లేవని అన్నారు, నాకు తెలిసిన ఒకే ఒక విద్య రియల్ ఎస్టేట్ అని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారు. 11 నెలల నుంచి చూస్తున్న ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కు అనుమతులు గాలిలొ దీపం.హైడ్రా బ్లాక్ మెయిల్ చేసేoదుకు ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ప్రాజెక్టు లు రద్దు...ఒక్క కొత్త ప్రాజెక్టు వద్దు అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి’ అంటూ విమర్శించారు కేటీఆర్.‘గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కేసీఆర్. మేము మంచిగా చేసిన కరెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది. రైతులు మోస పోయినం అని అంటున్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. -
రాహుల్.. ‘శోక్’నగర్‌కు వెళ్లండి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు.ఈ మేరకు హరీశ్‌రావు మంగళవారం(నవంబర్ 5) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించింది.రాహుల్ గాంధీ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అలాగే జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగం లేని క్యాలెండర్‌గా మార్చితే సరిపోయేది.యువ వికాసం కింద రూ.5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడింది.అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండి.కాంగ్రెస్ ప్రభుత్వం అశోక్ నగర్ ను 'శోక్ నగర్’గా ఎలా మార్చిందో కళ్లారా చూడండి’అని హరీశ్‌రావు రాహుల్ హైదరాబాద్ పర్యటనపై సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
ప్రజల ముందుకొచ్చే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టాను మించిపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను నయవంచన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి హింసించే పులకేశిలా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనను ఉద్దేశిస్తూ కేటీఆర్ సోమవారం సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డతో రాష్ట్ర ప్రజల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగించడమే కాంగ్రెస్ నైజం ప్రజలను నమ్మించి మోసం చేయటమే కాంగ్రెస్ నైజమని, ఆరు గ్యారంటీల పేరుతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించిందని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తీసుకున్న రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగిచూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికిన రాహుల్.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు, రైతులు, పోలీసులు, హైడ్రా, మూసీ బాధితులు, ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, ఆటో డ్రైవర్ల ముందుకు, తెలంగాణ ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను దోచుకుంటూ రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని ఆరోపించారు. సీఎం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, మంత్రులు తలోరకమైన ట్యాక్స్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నార ని మండిపడ్డారు. రూ.1.50 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్టులో ఢిల్లీ కాంగ్రెస్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే పదవిని కోల్పోయేలా చట్టం చేస్తామని ప్రకటించిన రాహుల్.. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని అవినీతి తెలంగాణగా మార్చినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. నీళ్లలో ధాన్యం.. ధర్నాలో రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేటీఆర్ సోమ వారం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. ‘నీళ్లలో ధాన్యం ఉంటే.. ధర్నాలో రైతు ఉన్నాడు. షరతుల్లో మిల్లర్లు ఉన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం పెళ్లిళ్లలో ఉన్నారు’అని విమర్శించారు. సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘మిల్లర్ల కతలు..రైతుల వెతలు’కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మిల్లర్లతో చర్చలు లేవు..రైతుకు భరోసా కరువు..అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్, ధాన్యం కొంటే 500 బోనస్..అసలు కొనకుంటే అంతా బోగస్’ అన్నట్టుగా తయారైందని విమర్శించారు. -
సీఎం రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు సోమవారం(నవంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘మూడు వందల ముప్పై రోజులు ముగిసింది. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు. ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.పెంచిన రూ.4 వేల పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయంటున్నారు అడబిడ్డలు. ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు.కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12000 ఎక్కడ అంటున్నారు.తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు.చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే.. చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసీ సర్కార్. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: 8న యాదాద్రికి సీఎం రేవంత్ -
రైతుల ఉసురు తీస్తున్న రేవంత్
నంగునూరు (సిద్దిపేట): అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నాడు రైతుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తే.. నేడు రేవంత్‌రెడ్డి వారి ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు ఆదివారం సందర్శించారు. రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేవని, పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదిలేక రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారని అన్నారు. రైతుల గోస ఎవరికీ పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనేవారు లేరని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో 11 సీజన్లలో రూ.72,815 కోట్లు రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేస్తే.. నేడు కనీసం గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పత్తికి మద్దతు ధర లేదని, మక్కలు కూడా ఎవరూ కొనడంలేదని తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకుల విద్యార్థులకు శాపంసాక్షి, హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురు కులానికి చెందిన 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని, సోకాల్డ్ ప్రజాపాలనలో అభంశుభం తెలియని పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. -
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో దశాబ్దాల పోరాటం మాది.. నేడు కంచం లాక్కున్నట్టుంది: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఢిల్లీ నేస్తం-అవినీతి హస్తం.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లుకాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లుపాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లుతెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లుప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లుసీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారుసుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారుఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం - మరో మీటింగ్ లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలుప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలిఢిల్లీ నేస్తం - అవినీతి హస్తం అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లుకాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లుపాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లుతెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు… pic.twitter.com/GnZDblFR77— KTR (@KTRBRS) November 3, 2024 -
మమ్మల్ని జైల్లో వేస్తారా.. ఆలస్యం ఎందుకు?.: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కమిషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పని చేశారో తమకు తెలియదని.. విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని.. తమ వివరణ ఛైర్మన్ తీసుకోలేదన్నారు.కమిషన్ వేస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తి అయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి. కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరు. మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు?. మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? నివేదికలో ఏమీ ఉండదని ముందే లీకులు ఇస్తున్నారు’’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు. -
రైతులకు సంచులిచ్చే తెలివి లేదా?.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ సీనియర్‌నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి -
కేంద్రానికి రాష్ట్రం సహకారం
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్‌రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రంసీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్‌గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. -
Telangana: పీఎం నరేంద్ర మోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధి, కాంగ్రెస్ సర్కారు హామీల అమలు అంశం రచ్చరేపుతోంది. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లుతున్నాయని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లు చేయగా... దానిపై సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా స్పందించారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు కౌంటర్‌గా ‘ఎక్స్’లోనే సమాధానమిచ్చారు. మోదీ దురభిప్రాయాలు, ఆయన పోస్టులోని వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నానంటూనే విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనిస్థాయిలో పథకాలు అమలు చేస్తున్నామని, ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ పథకాలు, వాటి నుంచి లబ్ధిపొందినవారి గణాంకాలను కూడా ప్రస్తావించారు. తామిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల పవిత్రమైన చిత్తశుద్ధి ఉందని వ్యాఖ్యానించారు. మోదీ ఏమన్నారంటే?నెరవేర్చలేని వాగ్దానాలివ్వడం తేలికేనని, అమలు మాత్రం కష్టమని కాంగ్రెస్ పారీ్టకి అర్థమవుతోందని విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నెరవేర్చలేమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రతి ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారని, ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాన్నయినా చూడండి. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లిపోతున్నాయి. వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడం లేదు. ఈ రాజకీయాలకు పేదలు, యువత, రైతులు, మహిళలు బాధితులుగా మిగిలిపోతున్నారు’’ అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మోదీకి కౌంటర్‌గా రేవంత్ ఏమన్నారంటే?సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని నిరాశ, నిస్పృహలను, నాటి చీకట్లను పారదోలామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉదయపు సూర్యుడిలా వెలుగొందుతోందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదని, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కునారిల్లుతోందని విమర్శిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు ప్రతిగా శనివారం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ పోస్ట్ చేశారు. తెలంగాణలో రైతు రాజులా బతుకుతున్నాడని.. మహిళలు, యువత, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంతోపాటు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మోదీ పోస్ట్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన పోస్ట్ యథాతథంగా.. ‘‘మీ (ప్రధాని మోదీ) ప్రకటనలో నా రాష్ట్రం, ప్రభుత్వం గురించి వెలువరించిన దురభిప్రాయాలు, వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపు దశాబ్దపు బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత డిసెంబర్ 7, 2023న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉత్సాహం, ఆశలు నెలకొన్నాయి. బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన రెండు హామీలను నెరవేర్చాం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాం. గత 11 నెలల కాలంలో తెలంగాణ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. 101 కోట్ల ప్రయాణాల ద్వారా తెలంగాణ మహిళలు ఏడాదిలోపే రూ.3,433.36 కోట్లు లబ్ధి పొందారు. ఏడాది పూర్తిగాకముందే తెలంగాణ రైతును రాజును చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీని అమలు చేశాం. ప్రస్తుతం తెలంగాణలోని 22,22,365 మంది రైతులు ఎలాంటి అప్పులు లేకుండా రాజులా బతుకుతున్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తూ కేవలం 25 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. మహిళలు సంతోషంగా ఉన్నారు.. గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఎలాంటి చార్జీలు లేకుండా విద్యుత్ సౌకర్యం పొందుతున్న మహిళల దీవెనలు మాకు అందుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మహిళలు అధిక గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే సిలిండర్ పొందుతున్న మహిళలు సంతోషంగా ఉన్నారు. మా హయాంలో ఇప్పటివరకు 42,90,246 మంది లబ్ధిదారులకు 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయడంతో వారంతా సంతోషంగా వంట గదుల్లోకి వెళుతున్నారు. 50వేల మందికి ప్రభుత్వం ఉద్యోగాలిచ్చాం.. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం. గ్రూప్–1, 2, 3, 4 వంటి అన్ని స్థాయిల్లోని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయని విధంగా 11 నెలల కాలంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యార్థులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వారి డైట్, కాస్మెటిక్ చార్జీలను 40శాతం మేరకు పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుద్ధి చేయడంతోపాటు పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టాం. మా చెరువులను కాపాడుకుంటున్నాం. గత పదేళ్లలో నిరాటంకంగా ధ్వంసమైన నాలాలు, ఇతర నీటి వనరులను సంరక్షించుకునే పనిలో ఉన్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క చెరువు కూడా కబ్జాకు గురికాలేదు. ఫ్యూచర్‌సిటీని సృష్టిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ తయారవుతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీతోపాటు ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశాం. మేం ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల మాకు పవిత్రమైన చిత్తశుద్ధి ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను గత 11 నెలల కాలంగా తిప్పికొడుతూ ఆ పాలనా చీకట్లను పారదోలుతున్నాం. ఉదయపు సూర్యుడిలాగా తెలంగాణ ఇప్పుడు వెలుగుతోంది’’ అని సీఎం రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు. -
కులగణనకు ఎమ్మెల్యేలే ఇన్‌ఛార్జ్‌లుగా వెళ్తారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆఫీసులో మహేశ్వర్ రెడ్డికి అసలు కుర్చీనే లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా.. మరో సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదు. రాష్ట్రంలో సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుండి వస్తుంది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి?. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈనెల ఆరు లేదా ఏడో తేదీన కుల గణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈనెల ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్లో కులగణనపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు. పార్టీ నేతలు, బీసీ నేతలు, వివిధ వర్గాల మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్‌గాంధీ వివరాలు తెలుసుకుంటారు. ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. విమర్శలను రాహుల్‌గాంధీ పాజిటివ్‌గా తీసుకుంటారు. కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించాం. కులగణనకు ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జులుగా వెళ్తారు అని స్పష్టం చేశారు. -
రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు -
మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ ఆ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారు. మా మద్దతుతోనే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పడం మొదలుపెడితే తట్టుకోలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్ -
రేవంత్.. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చూపించు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీలోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా అని నిలదీశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది నెరవేర్చని హామీల కథ . సీఎం రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణనే కాదు.. దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెబుతున్న 50వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా?. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా?. Mr. @revanth_anumula The BRS government, within nine years, has recruited 1,61,000 positions. It’s unfortunate that you continue to spread falsehoods on recruitments. Mr. Chief Minister, is it not true that almost all the 50,000 jobs claimed by you were notified, examination… https://t.co/eoExyVOd1x— Harish Rao Thanneeru (@BRSHarish) November 2, 2024రాష్ఠ్రంలో పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి 11 నెలలైనా అమలు చేయకపోవడం వాస్తవం కాదా?. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5లక్షలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదు. అన్ని పంటలకూ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ప్రీమియం బియ్యం రకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్.. 300 రోజులు గడచిపోయినా అమలు చేయడంలో విఫలమైంది’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణలో రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ చీరలను కూడా నిలిపివేసిందని మండిపడ్డారు. -
తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్’ వేదికగా అన్నారు. ‘‘పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’అని పేర్కొన్నారు.పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..ప్రజాస్వామిక తెలంగాణలో..మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024 -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్‌రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు -
నేడో, రేపో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పోటాపోటీగా ప్రయత్నాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.