breaking news
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత BRS Peddapally MP Venkatesh Neta joined Congress ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)… pic.twitter.com/To99hdcLru — Congress for Telangana (@Congress4TS) February 6, 2024 కాగా, ఎంపీ వెంకటేష్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి.. కోర్టుకు వెళ్తాం: కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇక, ఈ వ్యవహారం కేసులు పెట్టే వరకు వెళ్లింది. తాజాగా సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోంది. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోంది. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 -
సిట్టింగ్గా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వర్సెస్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి పాయల్ శంకర్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. సిట్టింగ్గా మరోసారి సోయం పోటీకి సిద్ధమవుతున్నారు. మరోపక్క ఇతర పార్టీల్లోని ఆశావహుల్ని పార్టీలోకి రప్పించేందుకు పాయల్ శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోయంకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో ప్రచారం ఉంది. ఇటీవల వరుసగా వేర్వేరు చోట్ల జరుగుతున్న పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బీజేపీలో లుకలుకలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోయంకు పోటీగా.. ఎంపీ సోయం బాపూరావుకు పోటీగా పార్టీలో ఇతర ఆశావహులను తెరపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల్లోనూ ఆశవాహులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మరో ఆదివాసీ ముఖ్యనేతను పార్టీలో చేర్పించేందుకు నేరుగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా చర్చ సాగుతోంది. టికెట్ హామీ కండీషన్‌తో పార్టీలో చేరే విషయంలో ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వకపోగా, హైదరాబాద్‌లోనే ఆ నేతలను చేర్పించాలని తిరిగి పంపించారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటీవల చేరారు. మరో ముఖ్య నేత మాత్రం టికెట్‌పై హామీ లేకపోవడంతో చేరకుండానే జిల్లాకు తిరిగి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ సమావేశాల్లో ఆ నేత యాక్టీవ్‌గా పాల్గొనడంతో పార్టీని వీడే యత్నాలు ముగిసినట్టేనా.. లేనిపక్షంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం ఆ నేత తీసుకుంటారనే విషయంలో పార్టీలో సందిగ్ధం నెలకొంది. సిద్ధాంతాలు ఎటుపోయాయి.. సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో అవి మచ్చుకు కనబడటం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రధానంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి మార్పు చోటుచేసుకోగా, అనూహ్యంగా పార్టీలో సీనియర్లను కాదని గుడిహత్నూర్ జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానందంను ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకులు సుహాసినిరెడ్డి, ఆదినాథ్ వంటి వారికి అవకాశం ఇవ్వకుండా జెడ్పీటీసీకి ఆ పదవి కట్టబెట్టడం వెనుక పార్టీలో ముఖ్య నేతల మధ్య తీవ్ర విభేదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్‌బాబు ప్రచార రథం నియోజకవర్గాల్లో తిరుగుతుండడంపై పార్టీ కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఎటుపోతున్నాయన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి నష్టం జరిగించే విధంగా పార్టీలో కార్యక్రమాలు జరుగుతుండడంతో పలువురు సీనియర్ నేతలు సైతం నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం. -
శాశ్వత నష్టం చేసిందే బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు శాశ్వత నష్టాన్ని చేకూర్చినది బీఆర్ఎస్ సర్కారేనని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి 2019 వరకు ఏటా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణాజలాల పంపిణీకి బీఆర్ఎస్ సర్కారు అంగీకరించిందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ ఏర్పాటయ్యాకే కృష్ణాజలాల విషయంలో ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. సోమవారం ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండించారు. ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 56 రోజులైంది. ఈ కాలంలో ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. హరీశ్‌రావు ఆరోపణలు పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వారి వ్యవహారశైలితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. పరీవాహక ప్రాంతం, కరువు నేలలు, జనాభా, సాగు యోగ్యమైన భూములు వంటి అంశాల ఆధారంగా తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల కృష్ణాజలాలను పంచేలా బీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేయాల్సి ఉన్నా.. దానికి భిన్నంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు ఒప్పుకుంది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అసమర్థత, చేతకానితనం, అవినీతి, కక్కుర్తి వల్లే ఈ సమస్య తలెత్తింది. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం 2020లో కేసీఆర్ సీఎంగా ఉండి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పదేపదే ఏకాంత చర్చలు జరిపి.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్ర చేశారు. తర్వాత కొన్ని రోజులకే మే 5న శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి 92,592 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు 8 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతూ ఏపీ ప్రభుత్వం జీవో 203 జారీ చేసింది. గ్రావిటీ ద్వారా తెలంగాణకు ఉచితంగా వచ్చే కృష్ణాజలాలను ఏపీకి తీసుకుపోతుంటే బీఆర్ఎస్ వాళ్లు సహకరించారు. కలసి కుట్రచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ పిలిచిన టెండర్లకు 2020 ఆగస్టు 10తో గడువు ముగిస్తే.. అంతకంటే ఐదు రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎంను రావాలని కోరింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరించడం కోసం కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లకుండా వాయిదా కోరారు. టెండర్లు ముగిశాకే మీటింగ్‌కు వెళ్లారు. తెలంగాణకు అందాల్సిన నీటిని కేసీఆర్, జగన్ కలసి రాకుండా చేశారు. నీటిపారుదల శాఖను కుప్పకూల్చారు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు. కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైంది. అసంబద్ధంగా నీటి పారుదల శాఖను నడిపి కుప్పకూల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు అప్పుచేశారు. దాని నిర్వహణ కోసం ఏటా రూ.10వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీ కూలిపోయి, మరో బ్యారేజీ కూలిపోయే స్థితిలో ఉండి.. ఒక్క చుక్క నీటిని వాడుకోలేని దుస్థితి ఉంది. చావులకు కారణం హరీశ్‌రావే.. ఉద్యమకాలంలో హరీశ్‌రావులా పెట్రోల్ పోసుకున్నట్టు నటించి వేరే వారి చావులకు మేం కారణం కాలేదు. ఆ సమయంలో హరీశ్, మిగతావరు పెద్ద బ్లాక్‌మెయిలర్లుగా ఉన్నారు. ఆ వివరాలు సైతం బయటపెట్టాల్సి ఉంటుంది. హరీశ్‌రావు అబద్ధాలను మానుకోవాలి..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారే ఒప్పుకుంది 2022 మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు నాటి బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకొన్నట్టు మినిట్స్‌లో రికార్డు చేశారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఆ మినిట్స్ ప్రతినిధులను మీడియా ప్రతినిధులకు చూపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పెద్దవాగు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.200 కోట్ల సీడ్ మనీ కేటాయించామని బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి బడ్జెట్ (2023–24) ప్రతిపాదనల్లో కూడా పొందుపర్చారని పేర్కొన్నారు. ఇలా ప్రాజెక్టుల అప్పగింతకు పలుమార్లు అంగీకరించి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
విషయం లేకనే వితండ వాదం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా కేసీఆర్ పదేళ్లు అడ్డుకున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మితిమీరిన అహంకారంతో, సంస్కారం లేని భాషలో సీఎం రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనవరి 17న కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లోగా 15 ఔట్లెట్లను అప్పగిస్తామని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాను. ఇప్పుడు తమ తప్పులేదంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు కృష్ణాబోర్డు రెండో మీటింగ్ ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో జరిగింది. ఇంజనీర్లు సీఆరీ్పఎఫ్ అనుమతితోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని అందులో పేర్కొన్నారు. పవర్‌హౌజ్ ఔట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. మరి ప్రాజెక్టులను అప్పగించినది నిజం కాకుంటే రెండు రాష్ట్రాల ఉద్యోగుల నిష్పత్తి, వారి జీతాల చెల్లింపు దాకా చర్చ ఎందుకు జరిగింది? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయం తీసుకుని ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను అప్పగించకుండా ఉంటే.. కాంగ్రెస్ వాళ్లు రెండు నెలల్లో ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితికి తెచ్చారు. మేం కృష్ణాబోర్డు పరిధిని ఒప్పుకోలేదు 2022లో జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో గానీ, 2023లో జరిగిన 17వ సమావేశంలోగానీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే ప్రతిపాదనకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకోలేదు. 16వ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టులో రెండు, నాగార్జునసాగర్‌లో ఏడు కంపోనెంట్స్‌ను అప్పగించే ప్రతిపాదనకు ఒప్పుకోబోమని చెప్పాం. ఏపీ ఒప్పుకుందని, తెలంగాణ నిర్ణయం పెండింగ్‌లో ఉందని మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. అలాగే ఈ అంశాన్ని అపెక్స్ కమిటీకి పంపాలని 17వ సమావేశంలో స్పష్టంగా చెప్పాం. కేసీఆర్ సంతకాలు చేశారని రేవంత్ అంటున్నారు. ఆ సమావేశానికే రాని కేసీఆర్ సంతకాలు చేశారనడం పచ్చి అబద్ధం. ఇంతకంటే జుటా సీఎం ఉంటారా? అప్పుడు మేం సర్కారులోనే లేము వైఎస్సార్ పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే జీఓ తెచ్చినప్పుడు మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేము. 610 జీవో అమలు, పులివెందుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2005 జూలై 4న మంత్రి పదవులకు రాజీనామా చేశాం. తర్వాత సెపె్టంబర్ 13న పోతిరెడ్డిపాడు జీఓ వచ్చింది. అలాంటిది మేం పదవుల్లో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు జీఓ వచ్చిందని రేవంత్ ఎలా మాట్లాడారు? నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ నేతలే పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. మాతో గొంతు కలిపినది పీజేఆర్ ఒక్కరే. జీవోకు వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. 40రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీదైతే.. పేగులు తెగేదాక కొట్లాడిన చరిత్ర మాది. మొదట వ్యతిరేకించింది మేమే.. రాయలసీమ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా మొదట స్పందించినది బీఆర్ఎస్ పార్టీనే. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే కేసీఆర్ వ్యతిరేకించారు. విభజన చట్టాన్ని రూపొందించినదే కాంగ్రెస్ పార్టీ. మీరు తెచ్చిన బిల్లులో కృష్ణాబోర్డు గురించి పెడితే ఆ బాధ్యత మీది కాదా? తెలంగాణ ఉద్యమానికి కారణమే నీటి సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని మంత్రి ఉత్తమ్ అనడం ఎంతవరకు సమంజసం? జయశంకర్ గారిని, అమరుల త్యాగాలను తప్పుపట్టేలా మీరు మాట్లాడుతున్నారు. మేం పుట్టిందే తెలంగాణ కోసం.. మీరు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్ పంట పొలాలకు తరలించారు. సీఎం రేవంత్ వద్ద సబ్జెక్ట్ లేక గాయిగత్తర చేస్తున్నారు. అసెంబ్లీలో సరైన సమాధానం చెప్తాం. బూతులతో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోం. గతంలో ప్రిపేర్ కాక అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ఈసారి అసెంబ్లీకి ప్రిపేరై రావాలి. చర్చిద్దాం. మంచి చెడూ అన్ని తెలుస్తాయి. మేం పుట్టిందే తెలంగాణ కోసం. రేవంత్ నోరు జారినా, రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతాం. దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. ఢిల్లీకి వెళ్దాం. రేవంత్ భేషజాలకు వెళ్లకుండా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే..
నల్లగొండ: ‘‘మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను బీజేపీకి తాకట్టు పెట్టారు. పైగా రేవంత్‌రెడ్డే కేంద్రానికి అప్పగించారని ఉల్టా మాట్లాడుతున్నారు. దీనిపై నల్లగొండలో సభ పెడతామంటున్నారు. కేసీఆర్ నల్లగొండకు ఎలా వస్తారో చూస్తాం. కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆయన మిలటరీని పెట్టుకుని వచ్చినా నల్లగొండ ప్రజలు తరిమికొడతారు’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ (శ్రీశైలం సొరంగమార్గం), డిండి లిఫ్ట్, లోలెవెల్ కెనాల్ ప్రాజెక్టులను పక్కనబెట్టి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఎల్బీసీ మంజూరు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. తన బిడ్డ కవిత లిక్కర్ కేసులో జైలుకు పోకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీకి తలొగ్గి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కుమ్మక్కై ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ పారిపోయేలా ఉన్నారు! కమీషన్ల కోసం చేసిన ప్రాజెక్టుల వల్లే జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేస్తారంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం ఏం చెబితే కేసీఆర్ అది చేశారని ఆరోపించారు. ‘‘పులి వస్తోందని హరీశ్‌రావు అంటున్నారు. పులి లేదు, గిలి లేదు. మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే. కేసీఆర్ ఓడిపోయినా ప్రైవేటు స్పెషల్ ఫ్లైట్‌ను ఇంకా ఎందుకు రద్దు చేసుకోలేదు? కవిత లిక్కర్ కేసు సమయంలో అద్దెకు తీసుకుని, మాజీ సీఎం అయినా దాన్ని అలానే ఉంచారంటే ఏ రాత్రి అయినా అరెస్టు చేస్తామంటే.. ఠక్కున ఫ్యామిలీ అంతా పారిపోయేందుకు స్పెషల్ ఫ్లైట్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. దుబాయ్ వెళ్లిపోతే ఎవరూ అరెస్టు చేయరనేది వారి ఉద్దేశం..’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ విషయంలో కేసు నమోదవడం, కేసీఆర్, హరీశ్‌రావు అరెస్టవడం ఖాయమని పేర్కొన్నారు. హంతకుడికి మంత్రి పదవి ఇచ్చారు నల్లగొండ జిల్లాకు చెందిన హంతకుడికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని.. ఆ మంత్రి అవినీతికి పాల్పడ్డారే తప్ప ఏనాడూ ప్రాజెక్టులను సందర్శించలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రెండు పూటలా తిండికి లేని వ్యక్తి మంత్రి అయ్యాక దోపిడీకి పాల్పడ్డాడని, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో దోచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఆ అవినీతిపై విచారణ చేయిస్తున్నామని, ఆయన జైలుకుపోక తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా అవినీతేనని, హెచ్ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గరే వెయ్యి కోట్లు దొరికాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ భవన్‌కు నేడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ అధి నేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయ కులతో సమావేశమవుతారు. ఈ మేరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించను న్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజాక్షే త్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేసీఆర్ చర్చించి నేతలకు సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణభవన్‌కు కేసీఆర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశముంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు వచ్చి కలవనున్నారు. -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్‌పై ఎఫ్ఐఆర్ -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా -
రాంచీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ రాజధాని రాంచీకి బయలుదేరారు. రాంచీలో రాహుల్ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రలో నేడు పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి బయలుదేరారు. జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్షకు సిద్ధమైన వేళ.. రాష్ట్ర రాజధాని రాంచీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు రాంచీలోని ఇందిరాగాంధీ హ్యాండ్లూమ్ ప్రాసెస్ హౌజ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. జార్ఖండ్ అసెంబ్లీలో చంపయీ సోరెన్ నేడు బలపరీక్షను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ అరెస్టు కాగా.. నూతన సీఎంగా చంపయీ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2న జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణం చేశారు. కాగా జార్ఖండ్ లో రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల తొలిరోజే చంపయ్ సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది మద్ధతు అవసరం ఉంటుంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ప్రలోభాలకు లోనవుతారనే అనుమానంతో ఇన్నిరోజులు జార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను హైదాబాద్‌లోనే ఉంచారు. హైదరాబాద్ శిబిరంలోని ఎమ్మెల్యేలు నిన్న సాయంత్రమే రాంచీ చేరుకున్నారు. కొందరు తిరుగుబాటు చేస్తారన్న ప్రచారాన్ని మంత్రి ఆలంగీర్ ఆలం తోసిపుచ్చారు. తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేసిన చేశారు. ఇదీ చదవండి: గృహజ్యోతికి కేబినెట్ ఆమోదం -
నల్లగొండలో గులాబీ సభ
సాక్షి, హైదరాబాద్: త్వరలో నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. దాదాపు రెండులక్షల మందితో సభ ఏర్పాటు చేసి, కేఆర్ఎంబీ వాస్తవాలను ప్రజలకు వివరించనుంది. సభావేదిక నుంచే పార్టీ అధినేత కేసీఆర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి..ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్లగొండ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించాలని అనుకుంటోంది. 2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా, 2023లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట మినహా అన్నిచోట్ల బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి కేడర్‌లో పునరుత్తేజం నింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో కృష్ణాజలాలపై సాగించిన పోరాటాన్ని సభావేదికగా ప్రజలకు వివరించాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కేఆర్ఎంబీతో ఎన్నిసార్లు సమావేశమైంది, సమావేశంలో చర్చించిన అంశాలను సభావేదిక నుంచే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలోని అంశాలతోపాటు ముఖ్యంగా నీటి వాటాలపై బీఆర్ఎస్ కొట్లాడిన తీరును ప్రజలకు వివరించి వారిని, చైతన్యపర్చాలని చూస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టాన్ని ప్రముఖంగా వివరించనుంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2లక్షల రుణమాఫీ, వరికి 500రూపాయల బోనస్ హామీలను ఎండగట్టనున్నట్టు తెలిసింది. సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల చేయకపోవడం, చివరి ఆయకట్టు రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వంటి అంశాలతోపాటు గత బీఆర్ఎస్ సాగునీటి విడుదలకు తీసుకున్న చర్యలు, రైతుల కోసం పాటుపడిన తీరును కేసీఆర్ వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే నల్లగొండ సభ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాంగ్రెస్ మాటల ప్రభుత్వం
మల్లాపూర్/గౌతంనగర్(హైదరాబాద్): కాంగ్రెస్ మాటల ప్రభుత్వమని.. ఆ పార్టీ చేసిన 420 హమీ లకు ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజయోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హజరై మాట్లాడారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని 100 రోజు ల్లో బొంద పెట్టడం ఖాయమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు..కానీ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే అనాగరిక వ్యాఖ్యలు సరికాదన్నారు. కరెంట్ బిల్లు సీఎం కడతాడా...సోనియాగాంధీ కడుతుందా చె ప్పాలన్నారు. చీకటిలో ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని, కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పపాలన తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీల అమలుకు 1. 57 కోట్ల మంది ఆడబిడ్డలు, 70 లక్షల మంది రైతులు రూ.15 వేల కోసం మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఖాతాలో ఎప్పుడు వేస్తారని, రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు, 46 లక్షల మంది పెన్షన్ కోసం ఇలా అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం నెహ్రూనగర్‌కు చెందిన దివ్యాంగుడు అంజికి స్కూటీ, బీఆర్ఎస్ కార్యకర్త కుమార్తెకు మెడికల్ సీటుకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ రావు శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు భద్రారెడ్డి, తాడూరి శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతి సాయిజెన్‌శేఖర్, బొంతు శ్రీదేవి, బన్నాల గీతాప్రవీణ్, ప్రభుదాస్, సింగిరెడ్డి శిరీషారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సేవాసమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఆరు గ్యారంటీలు ఇచ్చి...అయోమయంలో పడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చలేక అయోమయంలో పడిందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలోని లక్ష్మీసాయి గార్డెన్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డిపై గళమెత్తుదామన్నారు. మల్కాజిగిరి ప్రజలను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, వేధింపులకు పాల్పడినా రాష్ట్రవ్యాప్తంగా అందరం వచ్చి మల్కాజిగిరిలో దిగుతామన్నారు. మల్కాజిగిరి ప్రజలు దైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసి చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు మేకల సునీత రాముయాదవ్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, మీనా ఉపేందర్‌రెడ్డి, సబితకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశావహుల వడపోతకు నాయకత్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 3వ తేదీన ముగిసిన నేపథ్యంలో 6వ తేదీన టీపీసీసీ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో పాటు ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్‌చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కధమ్‌లు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భాగంగా పార్లమెంటు ఎన్నికల కోసం కార్యాచరణను రూపొందించుకోవడంతో పాటు ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆశావహుల బయోడేటాలను పరిశీలించి, పారీ్టలో వారి అనుభవం, పనితీరు, గత ఎన్నికల్లో చేసిన కృషి తదితర అంశాల ఆధారంగా మొత్తం 306 దరఖాస్తులను పరిశీలించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను ఏఐసీసీకి సిఫారసు చేయనున్నట్టు సమాచారం. ఈ పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయనుందని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఈనెల 15వ తేదీ నుంచి ఎప్పుడైనా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశముందని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
సభలో తేల్చుకుందాం!
ఎంత సమయం కావాలన్నా ఇస్తాం.. కేసీఆర్ నల్లగొండకు వెళ్లేముందు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. ఆయనకు ఎంత సమయం కావాలంటే అంత కేటాయిస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చెయ్యం. ప్రతి అంశంపై చర్చించాలి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి సమావేశాలకు గైర్హాజరు కావొద్దు. ఎంతసేపైనా చర్చిద్దాం. కావాలంటే చద్దర్లు, దుప్పట్లు కూడా తెచ్చుకోండి. అవసరమైతే తలుపులేసి మాట్లాడుకుందాం. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు కూడా రావాలి. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరుకావొచ్చు. అవసరమైతే ఉభయసభలను ఒకే సమయంలో సమావేశపరుస్తాం. సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ధనదాహానికి తెలంగాణ బలైందని, రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఎడారిగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని బదనాం చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నిధుల వినియోగం, నీటి పారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ఆదివారం సచివాలయంలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖలతో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితారావు అంతా కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు పునాదిపడినది కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా బిల్లులో పొందుపర్చారు. తెలంగాణ ఏర్పాటు బిల్లులోని ప్రతి అక్షరాన్ని తన సమ్మతితోనే పెట్టారని చెప్పుకునే కేసీఆర్.. ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? స్వయంగా సంతకాలు చేసి కూడా.. తెలంగాణ, ఏపీ మధ్య 811 టీఎంసీల జలాలను పంచుకునేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్, నాటి ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, సాగునీటి నిపుణుడు విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటిని పంచేందుకు ఒప్పుకొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే నీరే తీసుకునేందుకు ఎలా ఒప్పుకొన్నారు? ఇదంతా ఆ సమావేశం మినిట్స్‌లో రికార్డు అయింది. రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. అంతేకాదు 2022 మే 27న జరిగిన సమావేశంలో 15 ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు అంగీకరించారు. గత ఏడాది మే 19న జరిగిన కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 2023–24 బడ్జెట్లో గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్లు బడ్జెట్లో కేటాయించారు కూడా. ఇంత చేసిన కేసీఆర్.. ఇప్పుడు నల్లగొండలో నిరసన తెలుపుతాననడం సిగ్గుచేటు. కేసీఆర్ చేతగానితనం వల్లే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూభాగమంతా తెలంగాణలోనే ఉంటుంది. కానీ రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏపీ పోలీసులు తుపాకులతో మోహరించారు. తెలంగాణ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకునేందుకు ఏపీకి ఎంత దమ్ము ఉండాలి. కేసీఆర్ చేతగానితనం వల్లే అలా జరిగింది. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్న కేసీఆర్ బయటికి వచ్చే పరిస్థితి లేక ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్‌వన్నీ తుగ్లక్ నిర్ణయాలు: ఉత్తమ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్నీ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాఖ్యానించారు. లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూన్నాళ్ల ముచ్చట అయ్యిందని, పలు ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులకు అంచనాలను రెట్టింపు చేసి నిధులన్నీ దుబారా చేశారన్నారు. రెండు టీఎంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను తీసుకెళ్తుంటే చోద్యం చూశారు. నీటినిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టులు ఏడారిగా మారుతున్నాయని, రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టికొట్టిన పరిస్థితిని కేసీఆర్ సృష్టించారన్నారు. ఆయన కుట్రతోనే ప్రాజెక్టులకు బొక్కలు.. రాష్ట్ర ప్రయోజనాలు తీర్చాల్సిన జలాలను కేసీఆర్ కుట్రపూరితంగా ఆంధ్రకు కట్టబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు మంత్రులుగా పనిచేశారు. కేంద్రంలో కేసీఆర్‌తోపాటు నరేంద్ర మంత్రులుగా కొనసాగారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44వేల క్యూసెక్కుల జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలను టీఆర్ఎస్ మంత్రులు ఎందుకు అడ్డుకోలేదు? కేసీఆర్ లో పాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యా యం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ము చ్చుమర్రికి నీటిని తరలించుకెళ్లేలా మరో టన్నెల్ ఏర్పాటు చేసుకునేందుకు కేసీఆర్ కారణమయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుతో రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద బొక్కపెట్టారు. దానికి సంబంధించి 2020 మే 5న ఏపీ జీఓ 203ని కూడా తెచి్చంది. అప్పట్లో ప్రగతిభవన్‌కు వచి్చన ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ ఏకాంత చర్చల తర్వాతే ఆ జీఓ జారీ అయింది. ఆ ఏడాది ఆగస్టు 5న కృష్ణాబోర్డు సమావేశం ఉంటే కేసీఆర్ బిజీగా ఉన్నానంటూ వెళ్లలేదు. వెంటనే ఆ ప్రాజె క్టు టెండర్లు, కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత కమీషన్ల కోసం కుట్ర చేసిన వ్యక్తి కేసీఆర్. ఇలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమాలు చేస్తానంటే ప్రజలే బుద్ధిచెప్తారు. తెలంగాణ వ చ్చాక కేసీఆర్ సీఎంగా, ఆయన అల్లుడు హరీశ్‌రా వు నీటిపారుదల, ఆర్థికశాఖల మంత్రిగా ఏమేం చేశారో అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. వా రి ఘనకార్యాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ప్రసక్తే లేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా, గోదావరి నదులు పుట్టినచోటి నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న ప్రాజెక్టులన్నింటిపై సమీక్షించి రాష్ట్రాల వారీగా నీటి వాటాలు తేల్చాలి. కేవలం ఏపీ, తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులతో ముడిపెట్టొద్దు. ఈ అంశంపై ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చాం. అది తేలేవరకు ప్రాజెక్టుల అప్పగింత మాటే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పూర్తిచేస్తాం..’’అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. -
జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంపయీ సొరేన్ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్‌లోనే ఉంటారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
చర్చ పెట్టు..సమాధానమిస్తాం
వనస్థలిపురం (హైదరాబాద్), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో పెట్టిందెవరు? ‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్‌కు చెప్పారు. కానీ మధ్యాహ్నమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్లోనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్‌రావు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ వేదికగా మరో క్యాంపు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)క్యాంపు రాజకీయం ముగియటంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రం జార్ఖండ్‌కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్ మరో రాష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికైంది. తాజాగా బిహార్ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంది. బిహార్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లోని ఇబ్రహింపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది. #WATCH | Telangana: The 16 Congress MLAs reach Hyderabad. The floor test of the newly elected NDA government in Bihar is likely to happen on February 12. (Visuals from Hyderabad airport) pic.twitter.com/SELbKPBlPG — ANI (@ANI) February 4, 2024 ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి.. నితీష్ కుమార్ బిహార్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్‌కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అప్రమత్తమై ఎమ్మెల్యేను హైదరాబాద్‌కు తరలించటం గమనార్హం. -
సీఎం రేవంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. విభజన చట్టాన్ని తయారుచేసింది.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంతో తమకేం సంబంధం లేదని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమపై సీఎం రేవంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, ఉద్యోగాల నోటీఫికేషన్లపై మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్‌పై నెట్టే కుట్రలు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ నేతల కేటీఆర్, హరీశ్‌రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన సచివాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్‌పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే విభజన చట్టంలో ఈ అంశాలు పొందుపర్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆరే బాధ్యులని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంకు అప్పగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 89 వరకు విధివిధానాలను ఖరారు చేసే రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే పక్రియకు పునాది రాయి వేసింది 2014లోనని అప్పుడు కేసీఆర్ ఎంపీగా మద్దతు ఇచ్చారని తెలిపారు. -
బీఆర్ఎస్ ఓటమి మంచికే: కేటీఆర్
సాక్షి, ఉప్పల్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కూడా మంచికే జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, కేటీఆర్ ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఉప్పల్‌లో జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉందా? అనే ఫీలింగ్ వస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాల్కాజ్గిరిలో గెలుపు మనదే. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్ అని, చేతల ప్రభుత్వం కాదని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్‌లాగా మేము కూడా తిట్టగలం. కానీ, మాకు సభ్యత ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నాను. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోంది. ఇలా అయినా కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు తెలుస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం ఇలా మాట్లాడటం సిగ్గుచేటు.. డిఫెన్స్‌లో రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై సందేహాలు వస్తున్నాయి. ఆయన తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చేది చెప్పడానికి వ్యాఖ్యలు చేశారు.నిజానికి ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వాన్ని అయినా కుట్రపూరితంగా పడగొడితే తప్పే అవుతుంది. రేవంత్ కు సహజంగానే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఇప్పటికి్ప్పుడు రేవంత్ సీటుకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు కాని, ఆయన ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని ప్రజలు ఉరికించి కొడతారని ,వేపచెట్టుకు కట్టేసి వారి లాగులలో తొండలు వదలుతారని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా కాంగ్రెస్ నేతలకే ఈ హెచ్చరిక చేశారేమో అన్న భావన కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అవుతుంది. ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగితే ఏమి అవుతుంది. బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎంఐఎం మద్దతు ఇచ్చినా అది సరిపోదు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది కాని, బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. అంతేకాక పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వదిలే అవకాశం ఎప్పుడు వస్తుంది? పార్టీలో గ్రూపుల గొడవ పెరిగి, ముఖ్యమంత్రి రేసులోకి ఎవరైనా గట్టి కంటెండర్ వస్తే అప్పుడు జరిగితే జరగవచ్చు. అది కూడా పార్టీ మారకుండా తమకు నచ్చిన కాంగ్రెస్ నేతకు సపోర్టు చేస్తారు. అంతే తప్ప పార్టీ మారరు. అయినా రేవంత్ కు ఎందుకు అనుమానం వచ్చింది? ఇందులో రెండు లక్ష్యాలు ఉండవచ్యు. ఒకటి బీఆర్ఎస్ తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పడం ద్వారా ప్రజలలో సానుభూతి పొందడం, ఇంకొకటి తన సీటుకు ఎవరైనా కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తే వారి సంగగతి చూడవలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించడం కావచ్చు. విశేషం ఏమిటంటే ఇంద్రవెల్లి సభలో ఆయనతో పాటు సీఎం.. సీటు ఆశించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అక్కడే మరో కొందరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు ఉన్నా వారు ధ్రెట్ కారన్న సంగతి తెలిసిందే. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ రాగానే మల్లు భట్టి తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే ఆయా సందర్భాలలో తనకు పీసీసీ నాయకత్వం అప్పగించాలని కోరుతుండేవారు. మరో మంత్రి ,పీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశించారు. వీరు భవిష్యత్తులో సీఎం పదవికి పోటీ పడరని అనుకోలేం. తమ సొంత గ్రూపులు కట్టరని భావించలేం. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రేవంత్ వెనుకే ఉన్నారు. భవష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారు మంత్రి కావాలని కోరుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో 65 సీట్లే వచ్చాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కన్నా కేవలం ఐదు మాత్రమే అధికం అన్నమాట. అందుకే బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాట కూడా వారు అని ఉండాల్సింది కాదు. దీనిని ఆసరాగా చేసుకుని రేవంత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊళ్లలో ఉరికించి కొడతారని, వేపచెట్టుకు కోదండం వేయించి లాగులలో తొండలను వదలుతారని హెచ్చరించారు. మూతి పళ్లు రాలతాయని, తొక్కుతామని ..ఇలా ఏవేవో మాట్లాడారు. అంత సీరియస్ గా మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదో పాసింగ్ రిమార్కు అయితే ఫర్వాలేదు కాని, దానిపై నొక్కి వక్కాణించడం అంటే బహుశా ప్రజల దృష్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కాకుండా ప్రభుత్వం కూల్చివేతపై వచ్చే వదంతుల మీద పడాలని కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్తోమత ఉండకపోవచ్చు. బీజేపీ, ఎంఐఎం లతో కలిసి పడవేయాలనుకుంటే అప్పుడు ఈ మూడు పక్షాలకు కలిపి ఏభై సాలుగు సీట్లు అవుతాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక ఆరుగురిని లాగితే అప్పుడు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. కాని బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం. లు సహకరించుకునే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ కు ఉపయోగంగా ఉంటుంది. ఈ లోగా రేవంత్ రెడ్డి కనుక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే ఆ కధ వేరుగా ఉంటుంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడం చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రిని అభివృద్ది పనుల కోసమే కలిస్తే తప్పు లేదు. అదే టైమ్ లో వదంతులు రాకుండా చూసుకోవాలి. ఒకరకంగా ఇది చెలగాట రాజకీయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాడానికి అన్ని వ్యూహాలు వేస్తుంది. అదే టైమ్ లో బీఆర్ఎస్ కు తన ఉనికిని పరిరక్షించుకోవడమే పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ నేపద్యంలో కాంగ్రెస్ లో గ్రూపులు బలపడకుండా చూసుకోవడమే రేవంత్ ముందు ఉన్న సవాలు అని చెప్పవచ్చు. కనుక ఆయన కేసీఆర్ పేరుతో విమర్శలు చేసినా, అదంతా కాంగ్రెస్ లో సీఎం సీటుకు పోటీపడేవారిని ఉద్దేశించే అయి ఉండవచ్చన్న సందేహం వస్తుంది.దేశంలో అనేక ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాని అక్కడ ఎవరూ ఎమ్మెల్యేలను చెట్టకు కట్టేసిన దాఖలాలు లేవు. అంతదాకా ఎందుకు రేవంత్ కు గురువైన చంద్రబాబు నాయుడు తన మామ ఎన్ టి రామారావును సీఎం సీటులోనుంచి లాగిపడేశారు. అయినా అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను ఎవరూ చెట్టుకు కట్టేయలేదు. తొండలు వదల లేదు. గత టరమ్ లో కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ కూటమి పడిపోయింది. మద్యప్రదేశ్ లో కమలనాద్ ప్రభుత్వం కూలిపోయింది. రాజకీయాలలో ఏవైనా జరగవచ్చు. 1984లో ఎన్.టి.ఆర్. ను నాదెండ్ల బాస్కరరావు పడకొట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రజా ఉద్యమం వచ్చిన మాట నిజమే కాని, దానివల్ల ప్రభుత్వం పునరుద్దరణ కాలేదు. ఎన్ టి రామారావు మెజార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం వల్లే అని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వైపు ప్రభుత్వం ఏర్పడుతుంది. రేవంత్ ఈ సందర్భంగా మాట్లాడిన భాష మాత్రం సహేతుకంగా లేదని చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరుష పదజాలం వాడినా నడిచిపోయింది. కాని ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకూడదు. మూతి పళ్లు రాలతాయి.. కిందపడేసి తొక్కుతాం, లాగులలో తొండలు వేస్తారు.. ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆయన పదవికి అంత హుందానివ్వదు.కేసీఆర్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణ చేయడం ఆరంబించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికే రేవంత్ ప్రాదాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్ నిర్వహించడం ఏమిటని కొందరు సన్నాసులు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇంద్రవెల్లి కాల్పులు జరిగి పలువురు మరణించారు. ఆ తర్వాత స్థూపం కట్టుకోవడం కూడా కష్టమైంది.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ నివాళి అర్పిస్తోందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఇదంతా సమైక్య రాష్ట్ర పాలకుల తప్పు అని,సోనియాగాందీ ఆ తప్పును సరిచేయడానికి తెలంగాణ ఇచ్చారని కొత్త లాజిక్ తెచ్చారు. అలాగే ప్రముఖ గాయకుడు, మాజీ నక్సలైట్ నేత గద్దర్ పేర సినిమా అవార్డులు ఇస్తామని,నంది బదులు గద్దర్ పేరు పెడతామని కూడా రేవంత్ ప్రకటించారు. ఇవన్ని చూస్తుంటే నక్సల్స్ కు సంబందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం అనుసరిస్తున్న విదానాన్ని రేవంత్ తప్పు పడుతున్నట్లుగా ఉంది. నక్సల్స్ పోరాటాలను తెలంగాణ కాంగ్రెస్ సమర్ధిస్తుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనా ఒక క్లారిటీ లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారేమో అన్న అబిప్రాయానికి తావిస్తున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తా
కుషాయిగూడ: తాను బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మేయర్ బొంతు రాంమోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీ‹Ùరావుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి కాకుండా ఉద్యమ నాయకులు, పార్టీ అభ్యున్నతి కోసం అహరి్నశలు కష్టపడ్డవారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. నగర మేయర్‌గా గ్రేటర్ అభివృద్దితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కలి్పస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పని చేద్దామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసే ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. 2014 జూన్2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ఎలా పని చేసిందీ, కృష్ణా జలాల్లో హక్కుల రక్షణకు ఎంతగా శ్రమించిందీ సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేద్దామని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెండు, మూడురోజుల్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుదామని తెలిపారు. శనివారం కేసీఆర్ నందినగర్నివాసంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి మాజీ చీఫ్విప్వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య ఆయనతో సమావేశమయ్యారు. ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు విశ్వసనీయం సమాచారం మేరకు.. బీఆర్ఎస్అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఒప్పుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బలవంతంగా గెజిట్‌అమలు చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణాలో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్కౌన్సిల్తేల్చాలని కేఆర్ఎంబీ 17వ సమావేశంలో నిర్ణయించినా, ఆ తర్వాత అపెక్స్కౌన్సిల్సమావేశమే జరగలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్సర్కార్.. శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టుల్లోని పది ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని చెప్పారు. జల విద్యుత్ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఏటా శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో మొదలవగానే టీఎస్‌జెన్ కో విద్యుదుత్పత్తిమొదలు పెట్టేదని, తద్వారా రాష్ట్రంలోని ఎత్తిపోతలప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో కరెంట్ఉత్పత్తి చేసుకునే వారమని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఏపీ.. కృష్ణా బోర్డు మొదలు పార్లమెంట్వరకు అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిందని, సుప్రీం కోర్టులోనూ కేసు దాఖలు చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్‌ను కలిసిన ప్రముఖులు కేసీఆర్‌ను శనివారం సినీ నిర్మాత దిల్‌రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. తన తమ్ముడు శిరీ‹Ùరెడ్డి కుమారుడు ఆశి‹Ùరెడ్డి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా సీనియర్జర్నలిస్ట్దేవులపల్లి అమర్ ఏపీ రాజకీయాలపై తాను రాసిన ‘ది డెక్కన్పవర్ప్లే’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేశారు. మరో సీనియర్జర్నలిస్ట్వనం జ్వాలా నర్సింహారావు.. ‘ఆంధ్రా వాలీ్మకి రామాయణంలో చంద్ర ప్రయోగం’పుస్తకాన్ని బహూకరించారు. -
ఆరు గ్యారంటీలు గారడీ మాటలే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశంలో ఉగ్రవాదాన్ని, అవకతవకలను పెంచి పోషించడమే అవుతుందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేది లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కూడా లేదని, అవి ఒట్టి గారడీ మాటలేనని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ల సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, నర్సంపేటకు చెందిన రాణా ప్రతాప్‌రెడ్డి, పలువురు పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. రెండు నెలల్లో పలు రాజకీయ మార్పులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయని, బీజేపీలోకి చేరికలు పెరుగుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో కొత్త చరిత్ర లిఖించబోతున్నామని, అందులో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కాబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలిచి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడి, రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేయలేని పనులు, పాలనా సంస్కరణలు, అనేక రకాల చట్టాలు, భారతీయ అధ్యాత్మిక, సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమాలు మోదీ నాయకత్వంలో చేపట్టారని చెప్పారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ మంత్రులు కుంభకోణాలతో కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారం సంపాదించిందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే స్థితిలో ఉందని అన్నారు.