-
ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17 వేల కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రూ.17,900 కోట్లతోనే రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయ్యిందో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. వరికి బోనస్ పథకంలా.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శించారు. చారాణా రుణమాఫీకి బారాణా ప్రచారం అని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. -
అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది
సాక్షి, హైదరాబాద్: దిగజారుడు భాషలో నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హితవు చెప్పారు. రుణమాఫీపై మాటతప్పి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం అవాకులుచెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు ప్రవర్తించడం లేదనే విషయాన్ని రేవంత్ ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని విమర్శించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై విమర్శలకు దిగారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. తర్వాత అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టి, ఇప్పుడు రూ.13 వేల కోట్లు కోత పెట్టారన్నారు. అయినా ఎవరూ నమ్మడం లేదని, ప్రతి ఊరి దేవుడి మీద రేవంత్ ప్రమాణాలు చేశారని చెప్పారు.మోసమే తన విధానం..‘సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా రేవంత్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే దాదాపు రూ.17 వేల కోట్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే ఈ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతోందన్నారు.రుణమాఫీ పేరుతో దగా చేశారని స్పష్టంగా తేలిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏట్లో దూకి ఎవరు చావాలి? అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే కాక దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి, మాట తప్పిన ఆయన చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. కానీ ఆయనకు ఆ సంస్కారం లేదని, రేవంత్‌లో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదని విమర్శించారు.ముఖ్యమంత్రి స్థాయిలో మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, ఆ పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని తాను ఆందోళన చెందుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ చేసిన తప్పుకు, దైవ ద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్లు హరీశ్ చెప్పారు. -
‘మూసీ కంటే రేవంత్ నోరే కంపు’.. బీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టదు.సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే.. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్‌కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు. -
రేవంత్.. చరిత్రలోనే ఇంతలా దిగజారిన సీఎం లేడు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే సీఎం రేవంత్ రెడ్డిలా దిగజారిన, దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరోకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోవు అంటూ హితవు పలికారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా రేవంత్ ప్రవర్తించడంలేదని కామెంట్స్ చేశారు.కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు.. అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు. అబద్దం కూడా సిగ్గుపడి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడు. • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు.•అబద్దం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య…— Harish Rao Thanneeru (@BRSHarish) August 15, 2024 దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద, నామీద అవాకులు చెవాకులు పేలాడు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు.ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు.సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజ స్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నాడు.మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా?ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు అంటూ కౌంటరిచ్చారు. హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నావ్ అని తెగ బట్టలు చింపుకుంటున్న కాంగ్రెస్ సన్నాసులు.. ముందు హరీష్ రావు గారు ఏమన్నారో చెవులు పెద్దగ చేసుకొని వినాలి.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రూ. 2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికి ఆగష్టు 15లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి… pic.twitter.com/T3xsdTfUeD— Jagan Reddy (@JaganReddyBRS) August 15, 2024 -
‘మహిళల్ని అవమానించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై మంత్రులు పొన్నం, సీతక్కలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటున్నారు వాళ్లు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.‘‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా?. మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం ఈ వ్యాఖ్యలు. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం.గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు?. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. మేం చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. కేటీఆర్, ఆయన బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాల్సిందే అని సీతక్క అన్నారు.మరోవైపు రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని కేటీఆర్ అవమానపరుస్తున్నారు. అల్లం, ఉల్లి పొట్టు తీసుకుంటున్నట్లు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ డాన్స్‌లు చేసుమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్లు తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి అని మంత్రి పొన్నం అన్నారు. -
రాజీనామాకు సిద్ధమా హరీష్?: రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, వైరా: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం. హరీష్‌రావు సవాల్ ప్రకారం.. రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, సీఎం రేవంత్ వైరాలో రైతు రుణమాఫీ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రుణమాఫీని భట్టి విక్రమార్క సవాల్‌గా తీసుకున్నారు. విక్రమార్క.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టడానికి లెక్కలు వేసి హామీని నెరవేర్చారు. రుణమాఫీ చేస్తే.. హరీష్‌రావు రాజీనామా చేస్తాను అన్నాడు. సిగ్గు, శరం ఉంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ఎంత మంది అడ్డుపడినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సవాల్ చేసిన మాట ప్రకారం.. హరీష్ రావు రాజీనామా చేయాలి. సిద్దిపేటకు పట్టిన పీడ విరగడవుతుంది. హారీష్‌రావు.. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిద గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొందరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక రాబోతుంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ తరఫున రాజయ్య గెలవబోతున్నారు. అలాగే, తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు వస్తాయి.. అంటూ కామెంట్స్ చేశారు.కాగా, స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మార్పాక రవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయం. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించబోతున్నారు. కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చూస్తున్నాం. మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కేసు హైకోర్టులో నడుస్తుంది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన మంచి నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారు. 2014లో 63 సీట్లు, 2018లో 86 సీట్లు, మొన్న మనకు 39 సీట్లు వచ్చాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి, మోదీతో కలిసి లేని వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు. కేరళలో సీపీఎం గెలవలేదు. తమిళనాడులో సీపీఎం మద్దతు తెలిపితే గెలిచింది. దేశం మొత్తం నిట్టనిలువునా చీలింది. ఏ కూటమిలో లేని వాళ్లు ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు మేము అందరం మోస పోయాం. కరెంట్ పోతే తొండలు, ఉడుతలు పడ్డాయని ప్రకటన చేస్తున్నారు. ఊసరవెల్లులు ఉన్న రాష్ట్రంలో తొండలు, ఉడుతలు రావటం కామన్.30వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. యువత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైఖరి చూస్తున్నారు. నిరుద్యోగులు తిరగబడుతున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కోసం ప్రశ్నిస్తున్నారు నిరుద్యుగులు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?. జాబ్ క్యాలెండర్ కాదు.. మొన్న వాళ్ళు ఇచ్చింది జాబ్ లెస్ క్యాలెండర్. ఇప్పటి వరకు రైతుబంధు(రైతుభరోసా)కే దిక్కులేదు. రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అన్నారు చేయలేదు. రుణమాఫీ కాలేదు.. రాహుల్ గాంధీ సభకు రాలేదు. బోనస్ ఇస్తామని చెప్పాడు. సన్న వడ్లకే అని మళ్ళీ మాట మార్చాడు రేవంత్ రెడ్డి. సన్న వడ్లకు నువ్వూ ఇచ్చేది ఏంది?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని అన్నాడు. రేవంత్ రెడ్డికి బంగారం షాపు వాడు తెలుసో లేదో. బస్సుల్లో అల్లం వెల్లుల్లి ఓల్చితే తప్పా అని మంత్రి సీతక్క అంటున్నారు. మేము వద్దు అనలేదు కదా. మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి.కేసీఆర్ ఉన్నప్పుడు బస్సుల్లో ఏనాడైనా ఆడబిడ్డలు కొట్టుకున్నారా?. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబం కనిపించటం లేదా. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి తమ్ముళ్ల ఫొటోలు కనిపిస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. వెళ్లిన నేతల గురించి ఆలోచన వద్దు.ఎమ్మెల్సీ కవిత అన్నగా చెల్లెను కలిస్తే బీజేపీ వాళ్ళ కాళ్లు మొక్కాడని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మాకేం అవసరం. బీజేపీలో పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇంకో 50ఏళ్లు పార్టీని బ్రహ్మాండంగా నడుపుకుంటాం. త్వరలోనే పార్టీ పదవులు కూడా ఇస్తాం. నియోజకవర్గాల వారీగా కేసీఆర్ కలుస్తారు. ముందు స్టేషన్ ఘన్పూర్ వాళ్లనే కలిపిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
ఇందిరమ్మ రాజ్యంలో కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కంపుకొడుతున్న పల్లెలు, పట్టణాలే ఇందిరమ్మ పాలనకు ఆనవాళ్లా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెల్లో పాలన పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సాక్షి’లో ఈనెల 12న ప్రచురితమైన ‘పెను సంక్షోభంలో పట్టుగొమ్మలు’, 13న ప్రచురితమైన ‘పూర్.. పాలికలు!’ కథనాల క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేశారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణను కూడా పట్టించుకోకపోవటంతో పల్లెల్లో ప్రజాజీవనం దినదిన గండంలా మారిందని చెప్పారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగీ, మలేరియాలాంటి విషజ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. పంచాయతీలకు నిధులు చెల్లించకపోవటంతోనే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు పాత పనులకు సంబంధించి ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించటం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా పంచాయతీలకు ఠంచన్‌గా రూ.275 కోట్లు విడుదల చేశామని, కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1,800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులు గ్రామపంచాయతీలకు ఎప్పుడిస్తారని నిలదీశారు. ఉపాధిహామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4,305 కోట్లు అని, వాటి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో రూ.1,200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే...ఇక ఇతర శాఖల పరిస్థితి ఏమిటన్నారు. ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి లేదని చెప్పారు. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను గట్టెక్కించేందుకు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని సూచించారు.రూ.50 వేల కోట్ల అప్పులు చేయడమే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పా?బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు తీసుకురావడమే వారు తెచ్చిన మార్పా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా అంత అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు. 2023 నాటికి రాష్ట్రం రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. 8 నెలల కాలంలో దానిని రూ.50 కోట్ల అప్పుగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను పెంచిన బీఆర్ఎస్పై అప్పులు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్‌లో నిలుస్తుందని చెప్పారు. ఇదేవిధంగా అప్పులు చేసు కుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి రూ.4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల అప్పులభారం రాష్ట్రంపై పడడం ఖాయమని చెప్పారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయ టంలో కాంగ్రెస్ విజయవంతమైందన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు. -
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.కాగా, తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. Congress President Mallikarjun Kharge has approved the candidature of Abhishek Manu Singhvi as Congress candidate to contest the ensuing bye-election to Rajya Sabha from Telangana. pic.twitter.com/gj9EpkNENz— ANI (@ANI) August 14, 2024కాగా రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఇక, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
TG: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానిది కొత్త రికార్డు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది వరకు 5వేల900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న "మార్పు" అని బుధవారం(ఆగస్టు14) ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు.‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ చురకంటించారు. -
ఢిల్లీలో పోరాటం... రాష్ట్రంలో రెడ్ కార్పెటా?
సాక్షి, హైదరాబాద్: హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ–సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచి్చన కాంగ్రెస్ పార్టీ, తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అదానీ విషయంలో జాతీయ కాంగ్రెస్‌కు ఒక నీతి..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరో నీతా? అని రాహుల్ గాం«దీని ప్రశ్నించారు.ఒకవైపు అదానీ–సెబీ ఆరోపణలపై జేపీసీ వేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రేమో అదానీకి స్వయంగా రెడ్ కార్పెట్ పరుస్తూ ఆయన కంపెనీకి ద్వారాలు తెరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.‘మీరు అదానీ–సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తే.. అదానీ–కాంగ్రెస్ మిలాఖాత్పైనా, లోపాయికారీ ఒప్పందాలపైనా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశి్నస్తున్నారు’అని రాహుల్‌గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ స్పష్టం చేశారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌లో ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారమిచి్చన పాపానికి.. తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పార్టీ బీఆర్ఎస్ అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.బాన్సువాడ ఉప ఎన్నిక ఖాయం: కేటీఆర్ బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని, పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు బుద్ది చెపుతారని కేటీఆర్ అన్నారు. పోచారంను అన్ని విధాలా గౌరవించినా కార్యకర్తల రెక్కల కష్టంపై గెలిచి స్వార్థం కోసం పార్టీని వీడారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మంగళవారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను కలిశారు. కష్టకాలంలో పారీ్టకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ అన్నారు. త్వరలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా, గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషకరమైన అంశమని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇళ్లులేని పేదలకు పీఎంఏవై ఫలాలు అందాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కి లేఖ రాశారు. సొంతిల్లు అవసరమున్న ప్రజలు లక్షలాదిమంది ఉన్నా.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించిన సర్వేలో గత ప్రభుత్వం భాగం కాలేదని, జాబితా కూడా పంపలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టిందని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణ ప్రజలకు అందకుండా అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాను చేపట్టిన పర్యటనల్లో చాలా మంది ప్రజలు సొంతింటి నిర్మాణం కోసం అభ్యరి్థంచారని తెలిపారు. ఇదే విషయాన్ని ఈనెల 9న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని కిషన్‌రెడ్డి వివరించారు.ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలయినంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఆ మేరకు సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటున్నట్లు రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంపై వాళ్లది నేరమయ నిర్లక్ష్యం కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) లో... రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరు బయటపడిందని వివరించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉస్మానియాకు 70వ ర్యాంకా? ‘ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవరాల్ విభాగంలో.. ఉ స్మానియా వర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కొన్నేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడం అ టుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నా యి. కళాశాల విభాగంలో టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు.’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితైతే మరింత అధ్వానంగా ఉంది. ఐటీ క్యాపిటల్‌గా చెప్పుకునే తెలంగాణలో పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేదు.. 24వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
రాహుల్.. అదానీపై రేవంత్‌ను డిమాండ్ చేస్తారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో సెబీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదానీ దేశానికి తప్పు అయితే.. తెలంగాణకు ఎలా కరెక్ట్ అని ప్రశ్నించారు.కాగా, ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఆగస్టు 22న అదానీ-సెబీ బంధంపై హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చినందున కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చినందుకు సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండు విధాల ధోరణి అవలంబించటాన్ని మేము గమనిస్తున్నాం. Glad that the Congress had called for a nationwide protest in light of Hindenburg Report on Adani-SEBI nexus on Aug 22, but we at BRS see through their double standardsIf Adani is wrong for India, why and how is he right for Telangana? Will @RahulGandhi demand CM Revanth…— KTR (@KTRBRS) August 13, 2024 అదానీ భారతదేశానికి తప్పు అయితే, తెలంగాణకు ఎందుకు, ఎలా సరైనది?. అదానీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారా?. ఇది కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కానీ.. నమ్మకం గురించి కాదా?. తెలంగాణ భవిష్యత్‌కు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. మరి కాంగ్రెస్ నిలుస్తుందా? అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు పేరు రావొద్దని ప్రాజెక్టుల పేర్లు మార్చి..: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకురూ. 7,436 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు.‘సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాంలో రాజీవ్ సాగర్, ఇంధిరా సాగర్ల నిర్మాణం చేపట్టాం. కానీ కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, రాజీవ్, ఇంధిరా సాగర్లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బీఆర్ఎస్ నామకరణం చేసింది. రాజీవ్, ఇంధిరా సాగర్లు రూ. 3500 కోట్ల తో పూర్తయ్యేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రూ. 18 వేల కోట్లకు పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, ఆయకట్టు పెరగలేదు. రాజీవ్ ,ఇంధిరా సాగర్ లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది. 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ పాలనలో కేవలం 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ పర్మిషన్ మేమే తీసుకొచ్చామని హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఇంతవరకు సిడబ్ల్యుసి పర్మిషన్ రాలేదు. రాజీవ్, ఇంధిరా సాగర్లను మార్చి సితారామ ప్రాజెక్టు చేపట్టడమే తప్పుడు నిర్ణయం’ అని మంత్రి మండిపడ్డారు. -
ఉప ఎన్నిక ఖాయం.. సీనియర్ నేతకు ఓటమే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం సరికాదన్నారు. ఇదే సమయంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, బాన్సువాడ బీఆర్ఎస్ నేతలు మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసం కలిశారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు. సీనియర్ నాయకుడు అని పోచారంను బీఆర్ఎస్ ఎంతో గౌరవం ఇచ్చింది. అన్ని రకాలుగా గౌరవించినా పార్టీని వీడటం ఆయనకే నష్టం.కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించింది. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లు అయినా సరే వదిలి పెట్టేది లేదు. వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నో అవమానాలు.. మంత్రి తుమ్మల కంటతడి
సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్‌తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్మెంట్ జూలూరుపాడుకి మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు. -
అప్పుడు కలెక్షన్ కౌంటర్లు..ఇప్పుడు కాల్‌సెంటర్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు. రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్ఎస్ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్ఎస్ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు. -
పరాన్నజీవుల్లా మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారుడుతనంతో పరాన్నజీవుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులకు పేరు వస్తుందనే భయంతోనే... క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఈ నెల 15న సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఖమ్మంజిల్లా నేతలతో కలిసి సోమవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టులో కాంగ్రెస్ కేసులు వేసినా, బీఆర్ఎస్ అనేక కష్టాలను అధిగమించి పనులు పూర్తి చేసిందన్నారు. కానీ రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం రావడంతో ప్రాజెక్టు తాము కట్టినట్టుగా కాంగ్రెస్ నేతలు కటింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఏళ్లకేళ్లు పట్టే ప్రాజెక్టు డిజైన్, భూసేకరణ, అనుమతులు తదితరాలన్నీ ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాడు కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టా రని, గతంలో కేసీఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన మంత్రి తుమ్మల.. ప్రస్తుతం మాట మార్చారని చెప్పారు.సత్యవాక్య పరిపాలకులు సీతారాముల పేరుపై కట్టిన ప్రాజెక్టుపై మంత్రులు అబద్ధాలు చెబితే భగవంతుడు కూడా క్షమించడన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున పండుగ నిర్వహిస్తామన్నారు. వాట్సాప్ హెల్ప్‌లైన్ దరఖాస్తుల పరిశీలన రుణమాఫీ అందని రైతుల కోసం తెలంగాణభవ న్లో ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అందిన దరఖాస్తులను హరీశ్ పరిశీలించారు. 83748 52619 నంబరుకు వాట్సాప్ ద్వారా 72వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. సునీతారావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కష్టపడిని వారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. గోషామహల్లో తనకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు.కాగా, సునీతా రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో జరగడం లేదు. అసెంబ్లీ టికెట్ వదులుకుంటే రూ.5కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడు. అయినా నేను వదులుకోలేదు. ఓడిపోయే గోషామహల్ టికెట్ నాకు ఇచ్చారు. నాకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. చివరకు బీజేపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇస్తానని చెప్పారు.. అయినా నేను పార్టీని వీడలేదు.ఇప్పుడు నన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగింది. పురుషులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కష్టపడ్డ వారిని పట్టించుకోలేదు. మేము చేపట్టిన కార్యక్రమాలకు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రాలేదు. దీపాదాస్ మాకు టైమ్ ఇవ్వలేదు. మా ఫోన్ ఆమె లిఫ్ట్ చేయట్లేదు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ పెద్దలని కూడా కలిశాను. నేను చేసిన తప్పు ఏంటి?. ఎన్నికల్లో పోటీ చేయడం నా తప్పా?.మహిళ కాంగ్రెస్‌ను నడిపించడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పార్టీలో కష్ట పడ్డవారికి కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే పోరాటం చేస్తాను. నేను అందరిని కలుపుకొనిపోయే వ్యక్తిని. అన్ని పదవులకు నేను అర్హురాలిని. మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత లేదని ఏఐసీసీ ఇంచార్జ్ గురదీప్ సింగ్ సపర్ చెప్పారు. ఏ పదవి ఇచ్చినా చేపట్టడానికి నేను సిద్ధం. త్వరలో 33% మహిళ రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్, అల్కా లాంబ మాట ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
కష్టపడింది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్‌ది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తూ.. కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టును తామే కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.కాగా, హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించింది కేసీఆర్. ఆయన నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ పార్టీనే నిర్మించినట్టు ఫుల్ కలరింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి.. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ను కట్టింది కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కట్టిందని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ హితవు పలికారు. -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
‘మాటలు కోటలు దాటుతున్నాయ్’..రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగుకు స్వర్ణయుగమని..కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలంగా మారిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విటర్ వేదికగా ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఎక్స్‌లో కేటీఆర్ ఏమన్నారంటేకేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్. తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే..ఢమాల్ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం..! దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..ఎనిమిది నెలల్లోనే..ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? సంతోషంగా సాగిన సాగులో..ఎందుకింత సంక్షోభం..?? మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్య పెట్టి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అంటూ కేటీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.రూ.500 బోనస్ అని..నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ..ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు..ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు..చెరువులకు మళ్లించే తెలివి లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో..రైతు బతుకుకు భరోసానే లేదు.బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..క్యూలైన్లో పాసుబుక్కులు, చెప్పులు..కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు అప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు..కౌలు రైతుల బలవన్మరణాలు ఇలా.. ఒకటా.. రెండా..సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష !!అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లోతగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద… pic.twitter.com/2iyQGw8RSP— KTR (@KTRBRS) August 12, 2024