breaking news
-
న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్‌లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా -
కాంగ్రెస్‌ది నయవంచక పాలన: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ వచ్చింది అన్ని పథకాలు మాయమయ్యాయి. పథకాల పాలన పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే పాలన వచ్చింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
రేవంత్.. నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా?: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ వెంటనే అశోక్ నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అశోక్‌నగర్‌లో అభ్యర్థులను లాఠీలతో కొడుతున్నారు. వారి తలలు పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీకి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ కొంగ జపం చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. యువత చేస్తున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు.అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలో పట్ల జనం అప్రమత్తం అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటే.. మూసీ పేరుతో కాంగ్రెస్ దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. లక్షా 50వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ కుట్ర చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులు.. రుణమాఫీ, హామీలపై ప్రశ్నిస్తుంటే.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారు. రైతు భరోసా లేకుండా పోయింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వేరా?. ఉన్న అవకాశాలను కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీవో-29 ద్వారా లక్షల మంది అవకాశాలను కొల్లగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది’ అంటూ హామీ ఇచ్చారు. -
రేవంత్ రహస్య మిత్రుడు బండి సంజయ్: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్, పోలీసులకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ షేర్ చేసింది.బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్‌కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్’ అంటూ వీడియోను షేర్ చేసింది.నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్ కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్. pic.twitter.com/JI9h8EHF7Z— BRS Party (@BRSparty) October 19, 2024అంతకుముందు బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ఓపెన్ కేటగిరీ పోస్టులను కేవలం అగ్రవర్ణాల్లో కొందరికే పరిమితం చేయడానికి @revanth_anumula ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి GO 29 కి వ్యతిరేకంగా వేలాదిమంది నిరుద్యోగ బిడ్డల తరపున పోరాడుతున్నందుకు సంతృప్తి గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ఈ రోజు ఉండి ఉంటే నా… pic.twitter.com/iCSB3UuW3d— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 19, 2024 -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం అక్కర్లేదు.. మీ అవినీతిని నేను నిరూపిస్తా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఎవరి ఆదాయం ఎంతో.. ఎవరెంత దోచుకున్నారో ఎల్బీ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఇంటికి రానవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, అధికార ప్రతినిధి భవానిరెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, తానే వస్తానని అన్నారు.కేసీఆర్ కుటుంబం పదేళ్లు సాగించిన అక్రమాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానని అన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అంటున్న వాళ్లు.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్లాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. తెలంగాణను మొత్తం దోచుకు న్నదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని, వాళ్లే ఇప్పుడు తాము నీతిమంతులమని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబర్ 7 ఇచ్చిందని, 50 మీటర్ల బఫర్ జోన్లో నా ఇల్లు కూడా పోతుందని జూపల్లి వెల్లడించారు. -
మీ పాలనలో మూసీని ఎందుకు శుద్ధి చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూసీని ఎందుకు శుద్ధి చేయలేదో ప్రజలకు తెలియజేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన సచివాలయంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలసి మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాల ప్రజల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మూసీ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారని, మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీశ్‌రావు.. ఇద్దరి నోటికి అదుపు లేకుండా ఉందని, అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని అన్నారు.ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్లు ఊహించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల ప్రజలు దాదాపు కోటి మందిపైన కాలుష్య ప్రభావం పడుతోందని అన్నారు. మూసీ నది, ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే బాగుపడేది కాదన్నారు. ఇందులో విషపూరిత లవణాలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.మూసీ ప్రాజెక్టు పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ పిచ్చి కూతలు కూస్తే జనాలు తంతారని, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏముందో తనకు అర్థం కాలేవడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, మూసీ ప్రాజెక్టుకు అడ్డు పడితే జిల్లా ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్లగొండ నరకయాతన పడుతోందని, ఇప్పుడు ఆయన కొడుకు కూడా తయారయ్యారని ఆగ్రహించారు. కాగా, కేటీఆర్, హరీశ్‌రావు అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్‌లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
ఇక మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు వస్తా!
చార్మినార్ (హైదరాబాద్): ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడం కోసమే మూసీ ప్రస్తావన తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టంచేశారు. మూసీ నదిలో దుర్భర జీవనం గడుపుతున్న నిరుపేదలను కాపాడుతూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులను చేపట్టామన్నారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కమిటీ అధ్యక్షుడు, బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆధ్వర్యంలో శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన సద్భావన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, జీవో 111ను ఉల్లంఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు. అనుమతులున్న వారిని హైడ్రా ఏమీ చేయదన్నారు. మూసీ వద్దకు రావాలని సవాల్ విసిరిన వారి కోసమే తాను మూసీ (చార్మినార్) వద్దకే వచ్చానని.. ఇక మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు వస్తానని బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కబ్జాదారులను అరికట్టడానికి హైడ్రా అంకుశం తరహాలో పని చేస్తుందన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే అన్ని వర్గాల పేదలకు అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు భావించినందునే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారన్నారు.కొంతమంది సన్నాసులు కుటుంబ పాలన అంటున్నారని.. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ముందుండడమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. కేసీఆర్ కుబుంబపాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. వారి కుటుంబం దోపిడీ మాత్రమే చేసిందని ఎద్దేవాచేశారు. అడ్డం వస్తే.. బుల్డోజర్ సిద్ధంగా ఉంది...తాము పేదలను ఆదుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అడ్డం వస్తే తొలగించడానికి ఒక బుల్డోజర్ సిద్ధంగా ఉంచానన్నారు. ‘దొంగ నాటకాలాడుతున్న బావామరు దుల డ్రామాలన్నీ చూస్తున్నా.. చెప్పులు మోసేటో ళ్లూ మాట్లాడుతున్నారు.. మీ సంగతి నాకు తెలియదా.. మీలాగ దొంగతనాలు చేయలేదు.. చేతులు కట్టుకుని నా ముందు నిలబడిన రోజులు మర్చిపోయారా’ అంటూ వ్యాఖ్యానించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే... కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లను వారే స్వయంగా కూలగొట్టుకుని పేదల వద్దకు రావాలని.. మీవి అక్రమ కట్టడాలు కావా? అని పేర్కొన్నారు.మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నార న్నారు. అనంతరం రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కలిసి మాజీ మంత్రి జె.గీతారెడ్డికి సద్భావనా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదా రులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అపోహలొద్దు.. పరీక్ష రాయండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రూప్–1 విషయంలో అపోహలను నమ్మొద్దు. జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందరికీ న్యాయం జరగాలనే జీవో 29ను తీసుకొచ్చాం. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1ః50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్‌కు సెలెక్ట్ చేశాం. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు. అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరుకావాలి. లేకపోతే బంగారం లాంటి అవకాశం కోల్పోతారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శనివారం నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్–2024 ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందని, మధ్యలో నిబంధనలు మారిస్తే పరీక్షలను కోర్టు రద్దు చేయొచ్చ న్నారు. తాము పరీక్ష నిర్వహిస్తున్న విధానాన్ని కోర్టులు సమర్థించాయని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే..: గ్రూప్–1 విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసం వితండవాదం చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను ఉసిగొల్పి ప్రాణాలు బలిగొన్నారని, వారు మాత్రం రాజకీయంగా లబ్ధిపొంది ఉన్నత పదవులు చేపట్టారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనివారు.. ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఆందోళనలు చేయిస్తున్నారని, నిరుద్యోగులు వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. ఇక ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. పోలీస్ సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన ఉంటుందని.. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ వరకు పోలీస్ పిల్లలకు చదువు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పోలీస్ డ్యూటీ మీట్‌ను సిబ్బందిలో స్ఫూర్తినిచ్చేలా నిర్వహించారని ఉన్నతాధికారులను అభినందించారు. తెలంగాణ సాధన కోసం కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం 4 కోట్ల మంది మరువలేనిదన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని ఆదేశించారు. కాగా.. త్వరలోనే పోలీస్ స్పోర్ట్స్ మీట్ కూడా నిర్వహిస్తామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. డ్యూటీ మీట్ ముగింపులో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం(అక్టోబర్19)ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్జెక్ట్‌పై కాకుండా కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు.సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడు. మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యం.1956లో మంచినీటితో ఉన్న మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మార్చింది ఎవరు. దొరలు,రజాకార్లకు నిలయం కాంగ్రెస్.కోమటిరెడ్డి బాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: రేవంత్,బండిసంజయ్లది డ్రామా: కేటీఆర్ -
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అందుకు జీవో నంబర్ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్‌తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత -
ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్‌కు ఈటల సవాల్
సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు. -
రేవంత్, బండి సంజయ్‌లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్‌ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్‌ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
బుల్డోజర్లు రెడీ.. ఎవరు అడ్డం వస్తారో రండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలుగుతారా? ప్రశ్నించారు. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి శనివారం చార్మినార్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తాను. ఈరోజు మూసీ దగ్గరికే వచ్చా.. సవాలు విసిరిన హరీష్ ఎక్కడ పోయాడు?. హైడ్రా అనగానే ఈటల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు. హైడ్రాకి పేదలు ఎవరూ భయపడడం లేదు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారు. అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అడిగినప్పుడు మీ అనుమతి పత్రాలు చూపించండి.రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడకండి. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతాం. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తాం. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. పేదలు తాగే నీళ్ళలో డ్రెనేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతాంబుల్డోజర్ ఖాళీగా ఉంచాను. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకోలేదా.. పోయి చూద్దాం రండి. అజీజ్ నగర్లో హరీష్ ఫామ్ హౌస్ లేదా?. తన ఫామ్‌హౌస్ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడు. హరీష్, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని కామెంట్స్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు.నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌కు మూసీ నది ఓ వరం. కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారింది. మూసీ బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తాం. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మూసీని పునరుజ్జీవనం చేసేందుకు ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశాం. ఎన్టీపీ లాంటి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించాం. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలు.బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. మూసీ గురించి నాకు తెలుసు. మూడు నెలలు కాదు.. మూడేళ్లు ఉంటాను. నేను గతంలో మూసీ నిబోలి అడ్డాలోనే ఉన్నా. ఢిల్లీ పెద్దలకు నువ్వు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తాం. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. -
గ్రూప్-1 సమస్యపై రాహుల్ గాంధీ స్పందించాలి: హరీష్ రావు
సిద్దిపేట, సాక్షి: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్‌కు వినిపించటం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రూప్-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి. జీవో 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యర్థులు అన్యాయం అవుతారు. రైతులు, ఉద్యోగులను నిరుద్యోగులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పారు. .. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముక్కు నేలకు రాయాలి. మాట తప్పినందుకు. మూసి కోసం రూ. లక్షా 50 వేలు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: కేటీఆర్ వల్లే బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి: బండి సంజయ్ -
మూసీని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోం
లక్డీకాపూల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలా మూసీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోబోమని, దానిని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.17 మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని మలక్‌పేట్, కార్వాన్ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డిలతో కలసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ నీటిని తాగే స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమి, శ్రీనివాస్‌రెడ్డి, మూసీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు. -
చాలెంజ్ చేస్తున్నా.. వస్తా పద
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్.. నేను చాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావు కదా. పోదాం పదా..డేట్, టైమ్ మీరే చెప్పండి. నేను కారు డ్రైవ్ చేస్తా. మీరు నేను పోదాం. లేదంటే నేను రేపు 9 గంటలకు మీ ఇంటికి వస్తా. ముందు మూసీ బాధితులను కలిసిన తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ కట్ట మీదకు వెళ్లి నిర్వాసితులతో మాట్లాడుదాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చాం ’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం చేసిన సవాల్‌పై మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.‘మూసీ ఫ్రంట్ పేరిట రూ.లక్షన్నర కోట్లతో సుందరీకరణ, పునరుజ్జీవం చేస్తామని ప్రజల మధ్య ప్రకటించిన సీఎం రేవంత్ అలా ఎవరు అన్నారంటూ మాట మారుస్తున్నాడు. మెగాస్టార్లు సూపర్స్టార్లను మించి నటిస్తున్నాడు. శత్రుదేశాల మీద దాడి చేసినట్టుగా పేదల ఇళ్లపై జరుగుతున్న కూల్చివేతలను ప్రశ్నిస్తే మల్లన్నసాగర్ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నాడు’అని చెప్పారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, దేవీప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిని దిగజార్చేలా.. ‘ఎన్నికల హామీలను విస్మరించి సీఎం పదవి స్థాయిని దిగజార్చేలా రేవంత్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌తోపాటు అనేక నగరాల మీదుగా అనేక నదులు ప్రవహిస్తున్నాయనే జ్ఞానం లేదు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 4వేల ఇళ్లు ఇవ్వడంతోపాటు 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారం కంటే ఎక్కువే ఇచ్చాం. (పునరావాసకాలనీ ఫొటో చూపిస్తూ).. మూసీ తలంలో ఉన్న ఇళ్లు కూల్చి బాధితులకు పరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. డీపీఆర్, పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పేరిట ఇల్లు కూల్చే అధికారం లేదు. నదితలంలో ఉన్న నిర్వాసితులకు కూడా 2013 భూ సేకరణ చట్టాన్ని వర్తింపచేయాలి.ఏఐ టెక్నాలజీ వీడియోలతో స్టంట్లు మూసీ రివర్‌ఫ్రంట్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చూపుతూ రేవంత్ స్టంట్లు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో 31 ఎస్టీపీలతో మూసీ పునరుజ్జీవంకు ప్రయత్నాలు చేశాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను మూసీకి తరలించేలా వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ కూడా ఇచి్చంది. కానీ మల్లన్నసాగర్‌కు ప్లాన్ మార్చి కాంట్రాక్టర్లకు రూ.4వేలు లాభం చేసేలా రేవంత్ కుట్ర పన్నాడు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిలో ఫోర్త్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు. ఫార్మాసిటీతో కాలుష్యాన్ని తగ్గించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు మూసీ పునరుజ్జీవం కూడా సాధ్యమవుతుంది. సబర్మతి నది తరహాలో గైడ్‌వాల్ నిర్మించి వరదలు నివారించొచ్చు. అఖిలపక్ష భేటీకి పిలవలేదు ‘నేను ఉద్యమకారుడిని, ప్రజల కోసం పోరాడేవాడిని. పదివేల కుటుంబాల్లో సంతోషం చూసేందుకు మూసీలో ఉండడానికి నేను సిద్ధం. 15 రోజుల క్రితమే మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. నాకు ఎమ్మెల్యే పదవి లేకుండానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందని రేవంత్ చేసిన ఆరోపణ అర్థరహితం. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా శిష్యుడిగా కారు ముందు డ్యాన్స్ చేసిండు. మంత్రి పదవికి రాజీనామా చేసి గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఉండి నక్కి చూసిండు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. -
మూసీపై రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గజినీలా మారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం తంటాలు పడుతున్నాడన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని, రాహుల్‌గాం«దీకి డబ్బు కావాల్సినప్పుడల్లా తెలంగాణ గుర్తుకు వస్తోందన్నారు. ప్రాజెక్టు అంచనాలను రెట్టింపు చేయడంలో దిట్ట అయినందునే నిషేధిత కంపెనీ మెయిన్‌హార్ట్‌కు మూసీ డిజైన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు.మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడానికి అంగీకరించబోమన్నారు. గరిష్టంగా రూ.25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకునేలా రూ.లక్షన్నర కోట్లు వెచ్చిస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో శుక్రవారం తెలంగాణభవన్ వేదికగా ‘మూసీ ప్రాజెక్టు’పై గంటకు పైగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలు కేటీఆర్ మాటల్లోనే...‘మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపైనా పునరుజ్జీవం, సుందరీకరణ, ప్రక్షాళన, నల్లగొండకు శుద్ధమైన నీరు అంటూ సీఎం రేవంత్ పూటకో మాట చెబుతున్నాడు.రెండు వేల కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయింది. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.2700 ఖర్చు చేస్తామని సీఎం చెబుతున్నాడు. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద కుంభకోణం మరొకటి ఉండదు. తనపై ఉన్న కేసులకు భయపడి వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణానికి రేవంత్ అనుమతి ఇచ్చారు. గతంలో మోదీ ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టినా పర్యావరణ వేత్తలతో సూచనతో దామగుండం భూ అప్పగింత జీఓను అమలు చేయలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ద్వారా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం కోసం రూ.16వేల కోట్లతో పేదలను నిరాశ్రయులను చేయకుండా 9 ప్రపంచ స్థాయి కన్సల్టెంట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. మేము చేసిన పనులు చూపేందుకు శనివారం సిటీ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్‌కు వెళతాం. 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు స్వచ్ఛమైన నీరు వెళ్తుందనే విషయాన్ని గావుకేకలు, పెడ»ొబ్బలు పెడుతున్న నల్లగొండ మంత్రులు తెలుసుకోవాలి. గూగుల్ ఫొటోలతో ప్రజెంటేషన్ గూగుల్ నుంచి కాపీ కొట్టిన ఫొటోలతో రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.30 కోట్లు ఆస్తులు చూపించిన రేవంత్ డిజైన్లు వద్దంటే కన్సల్టెంట్లకు రూ.140 కోట్లు ఆస్తులు అమ్మి ఇస్తా అంటున్నాడు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం సీఎంకు అలవాటు. మూసీ ఒడ్డున బహుళ అంతస్తుల భవనాలు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకు.రీజువెనేషన్ స్పెల్లింగ్‌ను చూడకుండా రాస్తే ఆయనకు రూ.50 లక్షలు పట్టే బ్యాగ్‌ను బహుమానంగా ఇస్తా. మాపై అనేక ఆరోపణలు చేసిన సీఎం ఎందుకు విచారణ జరపించడం లేదు. మూసీ సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, మూక మాదిరిగా అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి మీద అనుమానం ఉంది. ఆయన్ను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి’అని కేటీఆర్ తన ప్రజెంటేషన్ ముగించారు. -
పేపర్ చూడొద్దు.. ‘రీజువెనేషన్’ స్పెల్లింగ్ చెప్తే 50 లక్షలిస్తా..రేవంత్‌కు కేటీఆర్ ఆఫర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌రెడ్డికి రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను’ అని అన్నారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..‘ కేసుల భయంతోనే మోదీకి రేవంత్ సాగిలపడ్డారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్‌తో 12లక్షల చెట్లు కొట్టేస్తారు. మా హాయాంలో చేసిన పది వేల ఆర్థిక సాయంపై విచారణ జరుపుకోవచ్చు. మూసీతో పాటు.. ఆరు గ్యారంటీల అమలుపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అసెంబ్లీ .. అసెంబ్లీలా నడవటం లేదు.. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వటం లేదు.’‘పేదల కడుపుకొట్టాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మూసీ శుద్ది చేయటాన్ని వ్యతిరేకం కాదు.. దోచుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. కోకాపేట, ఓఆర్ఆర్ కుంభకోణాలు ఉంటే విచారణ చేసుకో రేవంత్. మూసీ ప్రాజెక్ట్ తో ఎంత భూమి సాగులోకి వస్తుంది?.రేవంత్ రూ.50 లక్షలతో దొరికి తొమ్మిదేళ్ళు అయినా శిక్ష పడలేదు.పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌కు రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను.మాటలు మార్చి దొరికిపోవటం సీఎం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. రెడ్ కార్నర్ నోటీసులున్న పాకిస్తాన్ సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి KTR బంపర్ ఆఫర్రేవంత్ రెడ్డి రీజువెనేశన్ అనే పదం పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షల రూపాయలు పట్టే కొత్త బ్యాగ్ కొనిస్తా.. ఎందుకంటే ఢిల్లీకి డబ్బులు మోయాలి కదా - KTR pic.twitter.com/m9GVxsPmoK— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024 -
కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్‌రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్‌రావు సవాల్ -
తెలంగాణ పరువు తీస్తున్నారు: జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,సూర్యాపేట జిల్లా: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఆయన ఉపన్యాసాలుంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం(అక్టోబర్ 18)సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. తెలంగాణ ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్‌ను ఇప్పటి బడ్జెట్ పోల్చి చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుంచి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు.420 హామీలొద్దు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం,అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. మూసీ కూల్చివేతల తర్వాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కు భయమేస్తోంది. సీఎం ఏకపక్షంగా వెళుతున్నారని కాంగ్రెస్ సీఎంలే అంటున్నారు.ఇదీ చదవండి: మెగాస్టార్,సూపర్‌స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీశ్‌రావు