అమెజాన్‌లోకి ఐఫోన్‌ 6 స్పెషల్‌ వేరియంట్ | iPhone 6 32GB Gold Variant Now Available in India via Amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లోకి ఐఫోన్‌ 6 స్పెషల్‌ వేరియంట్

Aug 15 2017 3:13 PM | Updated on Sep 17 2017 5:33 PM

అమెజాన్‌లోకి ఐఫోన్‌ 6 స్పెషల్‌ వేరియంట్

అమెజాన్‌లోకి ఐఫోన్‌ 6 స్పెషల్‌ వేరియంట్

ఐఫోన్‌ 6 స్మార్ట్‌ఫోన్‌లో స్పెషల్‌ వేరియంట్‌ను ఆపిల్‌ భారత మార్కెట్‌లోకి లాంచ్‌చేసింది.

ఐఫోన్‌ 6 స్మార్ట్‌ఫోన్‌లో స్పెషల్‌ వేరియంట్‌ను ఆపిల్‌ భారత మార్కెట్‌లోకి లాంచ్‌చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ఐఫోన్‌6, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను గోల్డ్‌ రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లాంచింగ్‌ సమయంలో కేవలం స్పేస్‌ గ్రే రంగు ఫోన్‌ను మాత్రమే ఆపిల్‌ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రస్తుతం స్పేస్‌ గ్రే రంగుతో పాటు గోల్డ్‌ రంగు వేరియంట్‌ కూడా అందుబాటులో ఉండనుంది. గోల్డ్‌ రంగు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నందున్న ఈ వేరియంట్‌ను తీసుకొచ్చినట్టు ఆపిల్‌ తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియాలో దీన్ని ఆపిల్‌ విక్రయిస్తోంది. దీని ధర 26,999 రూపాయలు. అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 
 
పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్‌ చేసుకుంటే రూ.2000 వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతేకాక క్రెడిట్‌ కార్డులపై 3/6 నెలలు నో కాస్ట్‌ ఈఎంఐను ఎంపికచేసుకోవచ్చు. వొడాఫోన్‌ కస్టమర్లైతే, ఈ ఫోన్‌ కొనుగోలుతో అదనంగా ఐదు నెలల పాటు 45జీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు 1జీబీ లేదా అంతకంటే ఎక్కువ 4జీ డేటా ప్యాక్‌ను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతినెలా అదనంగా 9జీబీ డేటా 5 రీఛార్జ్‌లపై అందుబాటులోకి వస్తోంది. 2014లోనే ఆపిల్‌ ఐఫోన్‌ 6ను ఐఫోన్‌ 6 ప్లస్‌తో పాటు మార్కెట్లకు పరిచయం చేసింది.
 
ఆ సమయంలో 16జీబీ, 64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే 32జీబీ వేరియంట్‌ను స్పేస్‌ గ్రే రంగులో భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ గోల్డ్‌ రంగులో కూడా వినియోగదారుల ముందుకు వచ్చేసింది. దీని ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి... 4.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, కంపెనీ ఏ8 ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 8 ఎంపీ వెనుక కెమెరా,1.2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, ఐఓఎస్‌ 10.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement