రాష్ర్ట రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంత్రి సతీష్ జారకీహోళి రాజీనామా కొత్త చిక్కులను తెచ్చిపెటింది.
ప్రసన్నానందపురి స్వామీజీ
బెంగళూరు : రాష్ర్ట రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంత్రి సతీష్ జారకీహోళి రాజీనామా కొత్త చిక్కులను తెచ్చిపెటింది. ఈ విషయంలో ధార్మిక గురువులు జోక్యం చేసుకోవడంతో రాష్ర్ట రాజకీయాలు మరింత వేడెక్కాయి. అబ్కారీ శాఖ నిర్వహణ తన వ్యక్తిత్వానికి సరిపడదంటూ మంత్రి పదవికి సతీష్ జారకీహోళి రాజీనామా చేసిన వైనం విదితమే. ఈ నేపథ్యంలో వాల్మీకి వర్గానికి చెందిన ప్రసన్నానందపురి స్వామీజీ బెంగళూరులో గురువారం మీడియాతో మాట్లాడారు. రాజీనామా అనంతరం సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడేందుకు సతీష్ జారకీహోళీ విముఖత వ్యక్తం చేస్తుంటే తానే మధ్యవర్తిత్వం నిర్వహించినట్లు తెలిపారు.
మంత్రి మండలిలో ఉత్తమమైన శాఖను సతీష్ జారకీహోళికి కేటాయించకపోతే తదుపరి జరిగే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వాల్మీకి సముదాయానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఒప్పుకోకపోతే కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.