రైతు కనికట్టు..కోతుల ఆటకట్టు

Tiger Statue in Banana Gardens - Sakshi

కర్ణాటక , క్రిష్ణగిరి: చుట్టూ దట్టమైన అడవి. నిత్యం కోతులు చెట్లలోని కొబ్బరికాయలు, మామిడి, నేరేడు పళ్లను తింటూ పంటకు నష్టాన్ని కలిగిస్తుండగా ఎన్నో విధాలుగా కోతులను వెళ్లగొట్టేందుకు ఆ రైతు ప్రయోగాలు చేశాడు. కానీ అవన్నీ తాత్కాలికంగానే నిలిచి మళ్లీ యథావిధిగా కోతులు చెట్లలోని ఫలాలను ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఈ విషయంపై రైతు తీవ్రంగా ఆలోచించి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. సిమెంట్‌తో చేసిన పులి బొమ్మలను కొబ్బరి తోటలో ఏర్పాటు చేయడంతో కోతులు భయంతో వెళ్లిపోయాయని, గత మూడు నెలలుగా కోతుల జాడ కనిపించలేదని సూళగిరి సమీపంలోని చప్పడి గ్రామం వద్ద గల పార్వతీపురంకు చెందిన కుట్టియప్ప కొడుకు సెల్వం తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top