ప్రియుడి కోసం 200 కిమీ.. నడిచి వచ్చేసింది | Thanjavur Woman Walks to Madurai to see Tiktok Lover | Sakshi
Sakshi News home page

Apr 29 2020 1:11 PM | Updated on Apr 29 2020 1:35 PM

Thanjavur Woman Walks to Madurai to see Tiktok Lover - Sakshi

సాక్షి, చెన్నై : టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించిన యువతి అతగాడి కోసం 200 కిలోమీటర్లు నడిచి వచ్చింది. తంజావూరు నుంచి మదురై వరకు 200 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తంజావూరు ప్రాంతానికి చెందిన యువతికి  టిట్‌టాక్‌ ద్వారా మదురై ఆరపాలయంకు చెందిన యువకుడితో పరిచయమైంది. ఆమె.. అతడిని వన్‌సైడ్‌గా ప్రేమించింది. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది)

ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆమెతో టిట్‌టాక్‌ చేయడాన్ని నిలిపివేశాడు. అయినా ఆమె మాత్రం అతనిపై ప్రేమను పెంచుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా.. ఆ యువకుడిని చూడడానికి ఆమె మదురైకు నడిచి వస్తున్నట్టు టిక్‌టాక్‌ ద్వారా వీడియో పెట్టింది. తంజై నుంచి మదురైకి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంది. ఒంటరిగా నడిచి వస్తూ,ప్రేమ పాటలు పాడుతూ..ఏ ప్రాంతంలో ఉందో తెలిసే విధంగా వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. సోమవారం మధ్యాహ్నం ఆమె మదురై జిల్లా మేలూర్‌ సమీపంలో నడిచి వస్తున్నానని... తనను బైక్‌లో తీసుకు వెళ్లాలని ఆ యువకుడిని కోరింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆమెకు సూచనలు ఇస్తుండగా, కొందరు ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. (అమ్మ అంత్యక్రియలు కూడా వీడియో కాల్లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement