లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్ | Teacher arrested for sexual assault case | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్

Jul 2 2016 2:40 AM | Updated on Sep 27 2018 5:29 PM

లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్ - Sakshi

లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్

ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు ఇచ్చి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సేలం: ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు ఇచ్చి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా వాళపాడి సమీపం వెల్లకుండం ప్రాంతానికి చెందిన ఓ దంపతుల కుమార్తె లిద్దరు తిరుమనూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.
 
 వీరిలో ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో గురువారం పాఠశాల వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఏడుస్తూ పాఠశాలలో జరిగిన సంగతిని తల్లికి చెప్పింది. దీంతో బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి లైంగికంగా చిన్నారికి వేధింపులు ఇచ్చినట్టు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు వాళప్పాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దీనిగురించి మొదట బాలిక వద్ద విచారణ చేశారు.  
 
 విచారణలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వాళప్పాడి సమీపం కోనండవు గ్రామానికి చెందిన ఇ.మణిరాజ్ (27) అనే అతను చిన్నారికి లైంగిక వేధింపులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అతన్ని  అరెస్టు చేశారు. బాలిక చిన్నారికి సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వద్ద అసభ్యంగా నడుచుకున్న ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement