టికెట్ విక్రయానికి ప్రత్యేక విండోలు | Separate windows for ticket sale | Sakshi
Sakshi News home page

టికెట్ విక్రయానికి ప్రత్యేక విండోలు

Feb 13 2014 11:04 PM | Updated on Oct 4 2018 4:40 PM

ముంబైలో లోకల్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే రెండు కొత్త టికెట్ విండోల(కిటికీలు)ను ప్రారంభించింది.

సాక్షి, ముంబై: ముంబైలో లోకల్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే రెండు కొత్త టికెట్ విండోల(కిటికీలు)ను ప్రారంభించింది. బోరివలి, అంధేరి రైల్వేస్టేషన్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రత్యేక విండోల్లో రూ.5, రూ.10 ధరలతో ఉన్న టికెట్లను విక్రయించనున్నారు.
 కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు..
 ఈ విషయంపై పశ్చిమ రైల్వే అందించిన వివరాల మేరకు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధిక మంది రూ.5, రూ.10 చార్జీల టికెట్లను కొనుగోలు చేస్తారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు ఇలాంటి టికెట్ల విక్రయం కూడా బోరివలి, అంధేరిలలో అధికంగా ఉందని తె లిసింది. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇప్పటికే అనేక విధాలుగా టికెట్ విధానాలను మారుస్తూ వస్తున్న పశ్చిమ రైల్వే తాజాగా ఫిక్స్‌డ్ టికెట్‌తో కొత్త టిక్కెట్ విండోల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విండోల్లో కేవలం రూ.5, రూ.10 టికెట్లను మాత్రమే విక్రయించనున్నారు. రూ.5 టికెట్‌తో 0-10 కిలోమీటర్లు, రూ.10 టికెట్‌తో 11-30 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

 ఎరుపు, పసుపు రంగు విండోలు
 ప్రయాణికులు టికెట్ విండోలను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేక రంగు వేశారు. రూ.5 టికెట్ విండోకు ఎరుపు, రూ.10 టికెట్ విండోకు పసుపు రంగును వేశారు.

 దీంతో ప్రయాణికులకు సులభంగా టికెట్ తీసుకునే వీలుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ టికెట్ విక్రయాలను మార్చి 10 వరకు అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ప్రజల నుంచి ఆదరణ వస్తే మళ్లీ ఈ టికెట్ విండోల విధానాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement