రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత | Rs. 4 crores worth gold seized in tuticorin port | Sakshi
Sakshi News home page

రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Feb 11 2016 4:10 PM | Updated on Sep 3 2017 5:26 PM

రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత

రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత

తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో 12 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో 12 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఈ నౌకాశ్రయం నుంచి కౌలాలంపూర్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి ఈ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆగంతకుడు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో పార్సిళ్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.4 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా  సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై కౌలాలంపూర్లోని గల చిరునామాపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement