
ఉద్యోగాల పేరుతో వ్యభిచార కూపంలోకి
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను నమ్మించి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను కర్నాటక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు
బెంగళూరు: ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను నమ్మించి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను కర్నాటక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అల్మాసింగ్, దర్శన్‌పూర్వ, నయీమ్‌లు ఉద్యోగాన్వేషణలో భాగంగా కొద్ది నెలల క్రితం బెంగళూరుకు వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాకపోవడంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో ఓ మహిళను సంప్రదించారు.
ఆ మహిళ వారికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వ్యభిచార కూపంలోకి దించింది. దీనిపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు మహిళ వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను కూడా వ్యభిచార వృత్తిలోకి దించిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆనంద్‌రెడ్డి లేఅవుట్‌లో ఉన్న నిందితులను పరప్పన అగ్రహారం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.