హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి సౌర విద్యుత్ | Okhla missionary hospital to generate solar power | Sakshi
Sakshi News home page

హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి సౌర విద్యుత్

Feb 10 2015 12:39 AM | Updated on Apr 4 2019 5:24 PM

ఓఖ్లాలోని హోలీ ఆస్పత్రి త్వరలో విద్యుత్ ఇబ్బందులనుంచి బయటపడనుంది. ఇందుకు కారణం ఈ ఆస్పత్రి పై అంతస్తులో 300 కిలోవాట్ల

 న్యూఢిల్లీ: ఓఖ్లాలోని హోలీ ఆస్పత్రి త్వరలో విద్యుత్ ఇబ్బందులనుంచి బయటపడనుంది. ఇందుకు కారణం ఈ ఆస్పత్రి పై అంతస్తులో 300 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌరవిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండడమే. 350 పడకలు, 200 ఎయిర్ కండిషనర్లు, తొమ్మిది శస్త్రచిక్తిత్స థియేటర్లు, ఐదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెయ్యి బల్బులతోపాటు ఇతర  అనేక విద్యుత్ పరికరాలను వినియోగిస్తోన్న ఈ ఆస్పత్రికి పారిశ్రామికవాడతోపాటు ఇతర ప్రాంతాలనుంచి రోగులు వైద్యసేవల కోసం వస్తుంటారు. సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఆసుపత్రికి ప్రభుత్వం తరఫున ఎటువంటి రాయితీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్‌లోకి చైనాలో తయారైన సోలార్ ప్యానళ్లు వ రద మాదిరిగా వస్తున్నప్పటికీ ఈ ఆస్పత్రి యాజమాన్యం జర్మనీలో తయారైన పరికరాల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తోంది. ఇవి దీర్ఘకాలం మన్నుతాయని, అంతేకాకుండా నిర్వహణ వ్యయంతక్కువగా ఉంటుందని ఆస్పత్రి యాజమాన్యం భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement