తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట సెంటర్ వద్ద ఓ కారులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట సెంటర్ వద్ద ఓ కారులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఏజెన్సీ ఏరియా నుంచి రావులపాలెం మీదుగా పశ్చిమగోదావరి వైపు గంజాయి లోడుతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు చక్రం ఊడిపోయింది. కారులో ఉన్న వ్యక్తులు రిపేరు చేస్తుండగా సంఘటనాస్థలంలో స్థానికులు గుమిగూడారు.
దీంతో భయపడిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారును స్టేషన్‌కు తరలించి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 కేజీల బరువు ఉన్న 104 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ganja caught, police, east godavari, గంజాయి స్వాధీనం, పోలీసులు