దండం పెడతా వెళ్లిపో చిన్నతంబి | Farmers Suffering With Elephants Attack in Tamil Nadu | Sakshi
Sakshi News home page

దండం పెడతా వెళ్లిపో చిన్నతంబి

Feb 9 2019 12:18 PM | Updated on Feb 9 2019 12:18 PM

Farmers Suffering With Elephants Attack in Tamil Nadu - Sakshi

చెన్నై , సేలం: కొంత కాలం క్రితం అడవిలో నుంచి బయటకు వచ్చి అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న అడవి ఏనుగు చిన్నతంబి వారం రోజులుగా తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలై సమీప గ్రామాల్లో సంచరిస్తోంది. ఈ స్థితిలో గురువారం చెంగళిపుదూర్‌ ప్రాంతంలో చెరకు తోటలో వస్తుండగా మద్యం మత్తులో ఉన్న జ్యోతిమణి అనే వ్యక్తి చిన్నతంబి ఎదురుగా నిలబడి దండంపెట్టి అయ్యా గజరాజా నా వరిపంట పొలంలోకి రావద్దు.. ఇక నీ లీలలు చాలించు.. తిరిగి అడవిలోకి వెళ్లిపో అని వేడుకున్నాడు.. అయితే చిన్నతంబి జ్యోతిమణి వైపు రావడం గమనించిన అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన జ్యోతిమణిని అక్కడి నుంచి తప్పించి రక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement