విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం దావా | Defamation case against Vijayakanth's wife Premlata | Sakshi
Sakshi News home page

విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం దావా

Jul 26 2014 11:43 PM | Updated on Sep 2 2017 10:55 AM

విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం దావా

విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం దావా

విల్లుపురం కోర్టులో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం కేసు దాఖలైంది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచి త వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు

 టీనగర్: విల్లుపురం కోర్టులో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం కేసు దాఖలైంది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచి త వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై విల్లుపురం కోర్టులో శుక్రవారం కేసు దాఖలైంది. ఫిబ్రవరి రెండవ తేదీవిల్లుపురం జిల్లా ఉల్లుందూర్ పేటైలో డీఎండీకే రాష్ట్ర మహానాడు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఎమ్మెల్యేలు పార్థసారథి వెంకటేశన్ మాట్లాడినట్లు విల్లుపురం ప్రభుత్వ న్యాయవాది పొన్ శివ విల్లుపురం జిల్లా ఫస్ట్ క్లాస్ కోర్టులో నలుగురిపై వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ వచ్చే ఆగస్ట్ 27వ తేదీన జరుగనుంది. ఆరోజున విజయకాంత్, ప్రేమలత పార్థసారథి, వెంకటేశన్ హాజరు కావాలంటూ న్యాయమూర్తి కృష్ణమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement