పురుగుల మందు తాగి ఓ పత్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పత్తి వ్యాపారి ఆత్మహత్య
Jan 25 2017 11:24 AM | Updated on Aug 24 2018 2:36 PM
గుంటూరు: పురుగుల మందు తాగి ఓ పత్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డుకు చెందిన ఇ. అప్పారావు(60) అనే వ్యాపారి మంగళవారం రాత్రి మందు తాగాడు. అప్పుల బాధతో నల్లపాడులోని తన మిల్లులోనే పురుగుల మందు తాగాడు. వెంటనే కార్మికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement