breaking news
cotton farmer suicide
-
పత్తి రైతు ఆత్మహత్య
పాల్వంచరూరల్ : పంట నష్టం, అప్పుల భారం భరించలేని ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు... పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ గుండ్లమడుగు గ్రామానికి చెందిన కాలం బుచ్చిరాములు(39) సోమవారం రాత్రి పంట చేను వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఎకరం రూ.6500 చొప్పున ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గత ఏడాది చేసిన అప్పులను ఈసారి తీర్చాలనుకున్నాడు. పత్తి సాగుకు సుమారు మూడులక్షల రూపాయలు అప్పు చేశాడు. పంట నష్టం, అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య మాధవి, కుమార్తెలు మౌనిక, మహాలక్ష్మి, అనంతిక ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు దూరమవడంతో ఆ భార్యాబిడ్డలు గుండెలవిసేలా రోదించారు. మృతుని సోదరుడు నర్సింహారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం జరిగింది. -
పత్తి వ్యాపారి ఆత్మహత్య
గుంటూరు: పురుగుల మందు తాగి ఓ పత్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డుకు చెందిన ఇ. అప్పారావు(60) అనే వ్యాపారి మంగళవారం రాత్రి మందు తాగాడు. అప్పుల బాధతో నల్లపాడులోని తన మిల్లులోనే పురుగుల మందు తాగాడు. వెంటనే కార్మికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
వికారాబాద్లో పత్తిరైతు ఆత్మహత్య