
మేడంతో నేడు సీఎం భేటీ !
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల ....
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన విధివిధానాలపై ప్రధానంగా జర్చించారు.
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ, పునఃవ్యవర్థీకరణతోపాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆమెతో సిద్ధరామయ్య చర్చించనున్నట్లు సమాచారం. - సాక్షి, బెంగళూరు