‘సీఎం వెంట భూదొంగలు’ | Chada venkat reddy comments on Cm kcr | Sakshi
Sakshi News home page

‘సీఎం వెంట భూదొంగలు’

Feb 19 2017 4:04 AM | Updated on Mar 18 2019 7:55 PM

‘సీఎం వెంట భూదొంగలు’ - Sakshi

‘సీఎం వెంట భూదొంగలు’

టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉండి భూకబ్జాలు చేసిన భూ దొంగలంతా టీఆర్‌ఎస్‌లో చేరి సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

సాక్షి, ఖమ్మం: టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉండి భూకబ్జాలు చేసిన భూ దొంగలంతా టీఆర్‌ఎస్‌లో చేరి సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వీరి దొంగ కబ్జాలు బయటపడకుండా ఉండేందుకు భూ విషయాలను ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నయీమ్‌ డైరీని బయటపెడితే టీఆర్‌ఎస్‌లో ఉన్న దొంగలంతా బయటపడతారని, ఆ పార్టీలో లుకలుకలు తప్పవన్నారు. కోదం డరాంపై ఒంటికాలితో లేస్తున్నారని, ఆయన తెలంగాణ ద్రోహినా..? అని ప్రశ్నించారు. భూములను లాక్కోవడమే ధ్యేయంగా సర్కార్‌ పనిచేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement