బీబీఎం విద్యార్థినిపై అత్యాచారం | BBM student rape | Sakshi
Sakshi News home page

బీబీఎం విద్యార్థినిపై అత్యాచారం

Aug 23 2014 2:19 AM | Updated on Nov 9 2018 5:02 PM

బీబీఎం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు అత్యాచారం చేసిన సంఘటన ఇక్కడి కలాసిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..

  • నమ్మించి లాడ్జ్ తీసుకెళ్లి అత్యాచారం చేసిన స్నేహితుడు
  • బాధితురాలు బీహార్ వాసి
  • బెంగళూరు : బీబీఎం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు అత్యాచారం చేసిన సంఘటన ఇక్కడి కలాసిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బీహార్‌కు చెందిన ఓ యువతి (19) బెంగళూరులో ఉంటూ బనశంకరిలోని ఏవీజే కాలేజ్‌లో బీబీఎం చేస్తోంది. ఆమె స్నేహితుడు విక్రమ్ సింగ్.

    ఈనెల 17న అతను ఆ యువతిని నమ్మించి కలాసిపాళ్యలోని ప్రైవేటు లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. తోటి విద్యార్థులు ధైర్యం చెప్పడంతో.. బాధితురాలు శుక్రవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని వైద్య పరీక్షలకు తరలించామని, విక్రమ్ సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 376 కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement