బ్యాంకులకు వరుస సెలవులు ఉండడంతో పాటు ఏటీఎం కేంద్రాల్లో నగదు లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తిరువళ్లూరు: బ్యాంకులకు వరుస సెలవులు ఉండడంతో పాటు ఏటీఎం కేంద్రాల్లో నగదు లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువళ్లూరులో ఎస్‌బీఐ, ఇండియన్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, విజయాబ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు దాదాపు 20కి పైగా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో గత నెల 8 నుంచి ప్రజలు తమ పాతనోట్లను డిపాజిట్ చేసుకున్నారు. అయితే నగదు విత్‌డ్రాలో కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే కొంత మేరకు అందుబాటులో ఉన్నాయి.
అరుుతే రెండు వేల రూపాయలకు కూడా చిల్లర దొరకలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నోట్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాకముందే ప్రజలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. తాము డిపాజిట్ చేసుకున్న నగదును తీసుకోవడానికి ప్రజలు బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఉంది. రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే ఏటీఎం కేంద్రాల వద్ద వచ్చిన వారికి నోక్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి తిరువళ్లూరులోని ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో నింపిన నగదు శనివారమే అరుుపోవడంతో ఆదివారం ఏటీఎంలన్నీ మూతపడ్డాయి.