కమలమెక్కడ? | Assembly session from today | Sakshi
Sakshi News home page

కమలమెక్కడ?

Jan 23 2014 3:02 AM | Updated on Oct 4 2018 6:57 PM

శాసన సభలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే విషయమై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప తెలిపారు.

  •  బీజేపీకి విపక్ష స్థానంపై రేపు నిర్ణయం
  •  నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
  •  
    సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే విషయమై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ బుధవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని, అనంతరం న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

    కాగా ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలపై నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 30 వరకు వారం పాటు జరిగే సమావేశాల్లో 1,201 ప్రశ్నలను స్వీకరించగా, 630 ప్రశ్నలను అంగీకరించామని చెప్పారు. సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులేవీ పెండింగ్‌లో లేవని, కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement