హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి

హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి


తిరువన్నామలై: హాలీవుడ్ హారర్ సినిమా ది కాంజురింగ్-2 చూస్తూ 65 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. తమిళనాడులోని తిరువన్నామలైలో గురువారం రాత్రి ఈ విషాదకరం సంఘటన జరిగింది.



పోలీసులు చెప్పిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల విడుదలైన ది కాంజురింగ్-2  సినిమా చూసేందుకు ఓ థియేటర్కు నైట్ షోకు వెళ్లారు. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆయన్ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్ట వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top