సురేశ్‌ రైనా ఆడితేనే..! | will suresh raina prove final match against south africa | Sakshi
Sakshi News home page

సురేశ్‌ రైనా ఆడితేనే..!

Feb 23 2018 12:49 PM | Updated on Feb 23 2018 12:54 PM

will suresh raina prove final match against south africa - Sakshi

సురేశ్‌ రైనా(ఫైల్‌ఫొటో)

కేప్‌టౌన్‌: భారత క్రికెట్‌ జట్టులో ఏడాది తర్వాత దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన సురేశ్‌ రైనా ఇంకా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆదివారం జరిగిన తొలి టీ20లో 7 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 15 పరుగులు చేసిన రైనా.. బుధవారం రాత్రి ముగిసిన రెండో టీ20లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  దాంతో ఇక చివరిదైన మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో రైనా బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఏర్పడింది. తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే కనీసం ఒక గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌ రైనా నుంచి రావాల్సి ఉంది. ఒకవైపు మనీశ్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి యువ బ్యాట్స్‌మెన్‌లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న తరుణంలో రైనా ఫామ్‌ని నిరూపించుకోలేకపోతే మరో ఛాన్స్ ఇచ్చేందుకు సెలక్టర్లు మొగ్గు చూపకపోవచ్చు.

రేపటి మ్యాచ్‌లో రైనా ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడితేనే.. మార్చి 6 నుంచి 18 వరకు శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్‌కి అతడ్ని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారట. ఈ వారం చివర్లో సెలక్టర్లు జట్టుని ప్రకటించనున్నారు. సఫారీ పిచ్‌లపై కాసేపు క్రీజులో కుదురుకోగలిగితే, అటు తర్వాత భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుందని మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోనీ నిరూపించారు. దీన్ని ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే రైనా ఉపయోగించుకుని బ్యాట్‌తో మెరవాలి. సఫారీలతో చివరి మ్యాచ్‌లో రైనా రాణిస్తే కనుక అతనికి మరికొన్ని మ్యాచ్‌ల వరకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement