కోహ్లి సహకారం లేకపోతే..

What I Wouldve Done With Kohlis Support Nagal - Sakshi

న్యూఢిల్లీ: తనకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహకారం లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని భారత టెన్నిస్‌ యువ కెరటం సుమీత్‌ నాగల్‌ పేర్కొన్నాడు. యూఎస్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన నాగల్‌..ఆపై టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌తో జరిగిన తొలి రౌండ్‌ పోరులో ఓటమి పాలయ్యాడు. ఫెడరర్‌కు చెమటలు పట్టించి తొలి సెట్‌ను గెలిచిన నాగల్‌.. ఆ తర్వాత కూడా గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే ఫెడరర్‌ అనుభవం ముందు నాగల్‌ ఎదురునిలవలేకపోయాడు. కాగా, తాను సాధించిన ఘనతలు వెనుక కోహ్లి హస్తం ఉందని నాగల్‌ పేర్కొన్నాడు. 

‘2017 నుంచి విరాట్ కోహ్లి ఫౌండేషన్ నాకు సహాయం చేస్తోంది. ఆర్థిక ఇబ్బంది వల్ల అంతకు ముందు రెండుళ్లుగా నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయాను. విరాట్ కోహ్లి నాకు సహాయం చేయకపోయి ఉంటే.. నేను ఇదంతా సాధించేవాడిని కాదు. ఈ ఏడాది ఆరంభంలో కెనడా నుంచి జర్మనీ వెళ్లేప్పుడు నా జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదీ ఆ సహాయం అందినాకే. అంటే గతంలో నేను ఎలాంటి కష్టాలు ఎదురుకున్నానో ఆలోచించండి. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయివిరాట్ నుంచి సహాయం పొందడం నా అదృష్టం అనుకుంటున్నాను’అని సుమిత్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top