వాటిని మాత్రం చెప్పను: మొహ్మద్ షమీ | We have special plans for Australia, says Shami | Sakshi
Sakshi News home page

వాటిని మాత్రం చెప్పను: మొహ్మద్ షమీ

Sep 14 2017 12:33 PM | Updated on Sep 19 2017 4:33 PM

వాటిని మాత్రం చెప్పను: మొహ్మద్ షమీ

వాటిని మాత్రం చెప్పను: మొహ్మద్ షమీ

త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభకానున్న వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేయడం కష్టమేనని టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ స్పష్టం చేశారు.

చెన్నై:త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభకానున్న వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేయడం కష్టమేనని టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టు కాబట్టి క్లీన్స్వీప్ అనే ఆలోచన చేయడం లేదన్నారు. అయితే ఆసీస్ పై సిరీస్ గెలవడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్న షమీ.. అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆసీస్పై పైచేయి సాధించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయన్నార్నారు. కాకపోతే అవి ఏమిటో చెప్పలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని పేర్కొన్న షమీ.. ఆసీస్ జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు.

'ఆసీస్ జట్టులో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అదే సమయంలో టీమిండియా కూడా బలంగానే ఉంది. స్వదేశంలో జరిగే సిరీస్ భారత్ ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కాకపోతే వైట్వాష్ అనేది మా మదిలో లేదు. ఆసీస్ కట్టడి చేయడానికి కచ్చితమైన ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. వాటిని ఇప్పుడు బయటకు చెప్పలేను అని 'షమీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement